Bank Holidays List For July 2024: వచ్చే నెలలో (జులై 2024) వివిధ ప్రాంతీయ & జాతీయ సందర్భాలు, రెండు & నాలుగో శనివారాలు, ఆదివారాల కారణంగా బ్యాంక్‌లు మొత్తం 12 రోజులు పని చేయవు. మొహర్రం సెలవు కూడా జులై నెలలోనే ఉంది. వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే ముందుగానే ప్లాన్‌ చేసుకోండి. హాలిడే రోజు గురించి తెలీకుండా బ్యాంక్‌ దగ్గరకు వెళ్లారంటే మీ టైమ్‌ వేస్ట్‌ అవుతుంది. బ్యాంక్‌ కార్యకలాపాలకు సంబంధించిన ముఖ్యమైన పనులు ఉంటే, ముందుగా సెలవుల జాబితాను సేవ్‌ చేసుకోండి. సెలవు లేని రోజుల్లో బ్యాంక్‌కు వెళితే టైమ్‌ వేస్ట్‌ కాదు, మీ పని పూర్తవుతుంది.


కస్టమర్లు ఇబ్బంది పడకుండా, ఒక నెల ప్రారంభం కావడానికి ముందే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్‌ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్‌ హాలిడేస్‌ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి. 


జులై నెలలో బ్యాంక్‌ సెలవు రోజులు ‍‌(Bank Holidays in July 2024): 


03 జులై 2024  ----------  బెహ్ దీంక్లామ్ పండుగ సందర్భంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు
06 జులై 2024  ----------  MHIP Day (Mizo Hmeichhe Insuihkhawm Pawl Day) కారణంగా కారణంగా ఐజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు.
07 జులై 2024  ----------  ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతబడతాయి
08 జులై 2024  ----------  కాంగ్ రథ యాత్ర సందర్భంగా ఇంఫాల్‌లో బ్యాంకులకు హాలిడే
09 జులై 2024  ----------  ద్రుక్పా త్సే-జీ సందర్భంగా గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు ఇచ్చారు
13 జులై 2024  ----------  రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు 
14 జులై 2024  ----------  ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
16 జులై 2024  ----------  హరేలా సందర్భంగా డెహ్రాడూన్‌లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు
17 జులై 2024  ----------  మొహర్రం సందర్భంగా అహ్మదాబాద్, భువనేశ్వర్, చండీగఢ్, గాంగ్‌టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కొచ్చి, కోహిమా, పనాజీ, త్రివేండ్రం మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతబడతాయి.
21 జులై 2024  ----------  ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు
27 జులై 2024  ----------  నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
28 జులై 2024  ----------  ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పని చేయవు


బ్యాంక్‌ అనేది ఒక ముఖ్యమైన ఆర్థిక సంస్థ. బ్యాంక్‌ లావాదేవీలు ఒక్క నిమిషం స్తంభించినా ఆర్థిక వ్యవస్థ అల్లాడుతుంది. బ్యాంకులకు సుదీర్ఘ సెలవులు వస్తే ఖాతాదార్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే.. అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతతో ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా, బ్యాంక్‌తో ముడిపడిన చాలా పనులను ఇప్పుడు సులభంగా మారాయి. బ్యాంక్‌ సెలవుల రోజుల్లో కూడా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సదుపాయాలు అందుతున్నాయి. వీటి వల్ల, బ్యాంక్‌ హాలిడేస్‌లోనూ ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడంలో ఎలాంటి ఎటువంటి సమస్య ఉండదు. UPI వచ్చాక సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తవుతున్నాయి. ఒకవేళ డబ్బు అవసరమైతే, 24 గంటలూ పని చేస్తున్న ATMలు అందుబాటులో ఉన్నాయి.


మరో ఆసక్తికర కథనం: స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి మార్పు!, ఈసారి పెద్ద నిర్ణయం ఉండొచ్చు