భారతదేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL)  జూన్ తో  ముగిసిన చివరి త్రైమాసికంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ప్రతి గంటకు రూ .6.32 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మనీ మార్కెట్ లో గంటకు రూ. 3.79 కోట్లతో పోలిస్తే ఇది 67% అధికంగా ఉంది. గత త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీన్ రోజువారీ ప్రాతిపదికన రూ.151.71 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది గత ఏడాది కాలంలో రోజు వారీ ప్రాతిపదికన ఆర్జించిన రూ. 91 కోట్ల లాభాల కన్నా అధికంగా ఉంది. 


రిలయన్స్ సంస్థలో 42% వాటా కల్గిన రిలయన్స్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ ఆదాయం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 608 మిలియన్ డాలర్లు (రూ. 4519.6 కోట్లు) పెరిగింది. అంటే సగటున రోజుకు 2.86 మిలియన్ డాలర్లు (రూ. 212.6 కోట్లు) ఆర్జించారు. ఆయన ఆదాయం రోజుకు రూ.8.85 కోట్లు పెరిగింది.


బీఎస్‌ఈలో రిలయన్స్ షేర్లు శుక్రవారం దాదాపు 1% తగ్గి రూ. 2035.40 వద్ద ముగిశాయి. రిలయన్స్ కంపెనీ విలువ ప్రస్తుతం రూ .12,90,330 కోట్లు ఉంటే ఇందులో ఆ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర ఆదాయం విలువ 77.3 బిలియన్ డాలర్లు (రూ. 5,74,6250 కోట్లు) అని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. గత త్రైమాసికంలో రిలయన్స్ సంస్థ రోజు వారీగా రూ.1745.7 కోట్లు ఆర్జించింది. గంటకు రూ.72.74 కోట్లుతో 57.4 % వృద్ధి సాధించింది. ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ సంస్థ ఎగుమతులు రూ .56,156 కోట్లుగా ఉన్నాయి. సగటున రోజుకు రూ. 617 కోట్లు, గంటకు రూ. 25.71 కోట్లుగా ఉన్నాయి. 


రిలయన్స్ లాభాల్లో జియో ప్లాట్‌ఫామ్‌ వాటా రోజుకు రూ.40.12 కోట్లుగా ఉంటే, రిలయన్స్ రిటైల్ రూ. 10.57 కోట్లు ఉంది. ప్రతీ గంటకు జియో నుంచి వచ్చిన లాభాలు రూ .1.67 కోట్లు కాగా, రిలయన్స్ రిటైల్ లాభం రూ .44 లక్షలు వచ్చింది.  జియో ద్వారా కంపెనీకి రోజుకు రూ .224.69 కోట్ల ఆదాయం, రిటైల్ కార్యకలాపాల ద్వారా రూ. 423.59 కోట్లు, ఆయిల్-టు-కెమికల్స్ (O2C) వ్యాపారం ద్వారా రూ .1134.2 కోట్ల ఆదాయం లభిస్తుంది. గంటవారీ ప్రాతిపదికన, జియో నుండి వచ్చిన ఆదాయం రూ. 10.19 కోట్లు, రిటైల్ ఆదాయం రూ .17.64 కోట్లు, O2C వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం రూ .47.25 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో రిలయన్స్ జియో 1.4 కోట్ల కొత్త కస్టమర్లను జోడించింది. నెలకు సగటున 1.57 లక్షలు... గంటకు 6547 మంది కస్టమర్‌లు జోడైయ్యారు. ఈ కస్టమర్‌లు ప్రతిరోజూ దాదాపు అరగంటపాటు జియో నెట్‌వర్క్‌లో మాట్లాడుతూ, 500 MB డేటా వినియోగించారు.


 


Also Read: Mogalikudugu: తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుటుంబం అదృశ్యం... సూసైడ్ నోట్ హల్ చల్... గోదావరి వంతెనపై పిల్లల దుస్తులు