Bank Holidays List For January 2024: జనవరి 1వ తేదీన దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు. కాబట్టి, ఆదివారంతోపాటు సోమవారం కూడా బ్యాంకులు మూసివేసి కనిపిస్తాయి. 2024 జనవరిలో, ఆదివారాలు. రెండో, నాలుగో శనివారాలు, పండుగలు, పబ్బాలు కలుపుకుని మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు.
గణతంత్ర దినోత్సవం (Republic Day 2024) సందర్భంగా, జనవరి 26 శుక్రవారం రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతబడతాయి. ఇది గెజిటెడ్ సెలవు రోజు. దీని తర్వాత, జనవరి 27న నాలుగో శనివారం, 28న ఆదివారం ఉన్నాయి. కాబట్టి జనవరి నెలాఖరులో బ్యాంక్‌లకు వరుసగా 3 రోజులు సెలవులు (లాంగ్ వీకెండ్) వస్తాయి.
గెజిటెడ్ హాలిడేస్ మినహా మిగిలిన సెలవులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు, రాష్ట్రాన్ని బట్టి మారతాయి.
వచ్చే నెలలో బ్యాంక్‌లు మొత్తం 16 రోజులు పని చేయవు కాబట్టి, చివరి నిమిషంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదనుకుంటే, బ్యాంక్ హాలిడేస్ ప్రకారం ముందుస్తుగానే మీ పనిని ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.
మరో ఆసక్తికర కథనం: గోల్డ్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఇయర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
2024 జనవరిలో బ్యాంక్ హాలిడేస్ లిస్ట్:
జనవరి 1, 2024 - సోమవారం - నూతన సంవత్సరం ప్రారంభం - దేశవ్యాప్తంగా బ్యాంక్‌లకు సెలవు
జనవరి 2, 2024 - మంగళవారం - న్యూ ఇయర్ సెలబ్రేషన్ - ఐజ్వాల్‌లో సెలవు
జనవరి 7, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 11, 2024 - గురువారం - మిషనరీ డే - ఐజ్వాల్‌లో సెలవు
జనవరి 13, 2024 - రెండో శనివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 14, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 15, 2024 - సోమవారం - ఉత్తరాయణ పుణ్యకాలం/మకర సంక్రాంతి పండుగ/మాఘే సంక్రాంతి/పొంగల్/మాఘ బిహు - తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్‌టక్, గువాహటిలో సెలవు
జనవరి 16, 2024 - మంగళవారం - తిరువళ్లూవర్ డే - చెన్నైలో సెలవు
జనవరి 17, 2024 - బుధవారం - ఉజ్హవర్ తిరునాళ్/శ్రీ గురు గోవింద్ సింగ్ జీ జయంతి - చండీగఢ్, చెన్నైలో సెలవు
జనవరి 21, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 22, 2024 - సోమవారం - ఇమోయిను ఇరట్ప - ఇంఫాల్‌లో సెలవు
జనవరి 23, 2024 - మంగళవారం - గాన్-నగై - ఇంఫాల్‌లో సెలవు
జనవరి 25, 2024 - గురువారం - థాయ్ పూసం/మొహమ్మద్ హజారత్ అలీ జయంతి - చెన్నై, కాన్పూర్, లఖ్‌నవూలో సెలవు
జనవరి 26, 2024 - శుక్రవారం - గణతంత్ర దినోత్సవం - అగర్తల, దెహ్రాదూన్, కోల్‌కతా మినహా భారతదేశం అంతటా సెలవు
జనవరి 27, 2024 - నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
జనవరి 28, 2024 - ఆదివారం - దేశవ్యాప్తంగా వారాంతపు సెలవు
బ్యాంక్ సెలవు రోజుల కోసం బ్యాంకింగ్ టిప్స్
సెలవుల కారణంగా బ్యాంక్‌లు పని చేయకపోయినా, ఖాతాదార్లు పెద్దగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ATMని ఉపయోగించవచ్చు, బ్యాంక్ సెలవు రోజుల్లోనూ ATMలు 24 గంటలూ పని చేస్తాయి. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా UPI అందుబాటులో ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: 2024లో మీ లైఫ్‌ను మార్చేసే 14 ఫైనాన్షియల్ టిప్స్