Yamaha MT 09: అప్‌డేట్ అయిన ఎంటీ09ని రివీల్ చేసిన కొద్ది రోజుల తర్వాత, యమహా ఇప్పుడు దాని ట్రిపుల్ సిలిండర్ స్ట్రీట్ నేక్డ్‌కు సంబంధించిన కొత్త హై స్పెక్ ఎస్పీ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఈ అప్‌డేట్‌లో కొత్త స్టైలింగ్, కొత్త ఎలక్ట్రానిక్స్, అధునాతన ఫీచర్లు ఉన్నాయి.


డిజైన్, స్టైలింగ్
కొత్త ఎస్పీ ఎడిషన్ స్టాండర్డ్ బైక్ ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అనేక ఫీచర్లను పొందింది. స్టైలింగ్, ఎర్గోనామిక్స్ రెండూ ఇప్పుడు మరింత అద్బుతంగా ఉన్నాయి. ఇది ముందు వెర్షన్ బైక్ నుంచి కొత్త బ్రెంబో మాస్టర్ సిలిండర్‌ను కూడా తీసుకుంది. కానీ ఇది బ్రెంబో స్టైల్మా కాలిపర్‌లతో దాన్ని అప్‌గ్రేడ్ చేసింది.


హార్డ్‌వేర్ ఎలా ఉంది?
దీని సస్పెన్షన్ కూడా అప్‌డేట్ అయింది. రెండు వైపులా కొత్త ఫుల్లీ అడ్జస్టబుల్ యూనిట్లు ఉన్నాయి. ముందు భాగంలో ఇది సర్దుబాటు చేయగల ప్రీలోడ్, రీబౌండ్, హై, లో-స్పీడ్ కంప్రెషన్ డంపింగ్‌తో కూడిన డీఎల్సీ-కోటెడ్ 41ఎంఎం కేవైబీ ఫోర్క్‌ను పొందుతుంది. ఇది వెనుకవైపు రిమోట్ ప్రీలోడ్ అడ్జస్టర్‌తో ఫుల్లీ అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ షాక్ సస్పెన్షన్‌ను కూడా కలిగి ఉంది.


అందుబాటులో అనేక రైడ్ మోడ్‌లు
ఇందులో స్పోర్ట్, స్ట్రీట్, రెయిన్ మోడ్‌లు కాకుండా ఎస్పీ రెండు కస్టమ్ రైడర్ మోడ్స్‌తో పాటు నాలుగు ప్రత్యేకమైన ట్రాక్ మోడ్‌లతో వస్తుంది. ఇవి ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేలో ప్రముఖ ల్యాప్ టైమర్‌ను కలిగి ఉండే ట్రాక్ థీమ్‌తో వస్తాయి. అలాగే దాని అడాప్టబుల్ ట్రాక్ మోడ్ రెండు సెట్టింగ్స్, బ్రేక్ కంట్రోల్ ద్వారా ఇంజిన్ బ్రేక్ మేనేజ్‌మెంట్ ట్యూనింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీరు వెనుక నుండి ఏబీఎస్‌ను తీసివేయవచ్చు.


కీలెస్ సిస్టమ్‌
ఇందులో ప్రధాన అప్‌డేట్ ఏమిటంటే కీ లెస్ సిస్టమ్‌ను జోడించడం. ఇది యమహా స్మార్ట్ కీ సిస్టమ్‌ను పొందిన మొదటి ఎంటీ మోడల్‌గా నిలిచింది. ఇది హ్యాండిల్‌బార్, ఫ్యూయల్ ట్యాంక్‌ను లాక్/అన్‌లాక్ చేయడంతో పాటు ఫిజికల్ కీ లేకుండా మోటార్‌సైకిల్‌ను స్టార్ట్ చేయడానికి అనుమతి ఇస్తుంది.


భారతదేశంలో ఎప్పుడు లాంచ్
యమహా ఎంటీ09 భారతదేశంలో ఇంతకుముందు అమ్మకానికి ఉండేది. కానీ బీఎస్6 ఎమిషన్ రూల్స్‌ను అమలు చేశాక తర్వాత నిలిపివేశారు. యమహా ఈ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో తిరిగి ప్రవేశపెట్టడంపై ఆసక్తిని కనబరిచింది. ఇప్పుడు ఇది కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉంది. అయితే ఈ టాప్ స్పెక్ ఎస్పీ ఎడిషన్ భారతదేశంలోకి వస్తుందో లేదో చూడాలి. ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్‌తో పోటీ పడనుంది.


మరోవైపు ఇటీవలే యమహా మోటార్స్ రెండు కొత్తగా అప్‌డేట్ చేసిన స్కూటర్లు ఫాసినో, రే జెడ్‌ఆర్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త Fascino S 125 Fi హైబ్రిడ్ (డిస్క్) వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.91,030గా కంపెనీ నిర్ణయించింది.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!