టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందనా పేరుతో ఓ మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక ఫుల్ గా ఎక్స్పోజింగ్ చేసినట్లు ఉంది. వీడియో చూసిన నెటిజన్స్ అంతా ఇది రియల్ వీడియో అనుకున్నారు. కానీ అది ఫేక్ వీడియో అని తేలడంతో సినీ సెలబ్రిటీలు సైతం ఈ వీడియోని చూసి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియో అంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోపై రష్మిక ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.
మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని అన్నారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. ఈ మేరకు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది.
"సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధ కలిగిస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం భయానకంగా అనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం కారణంగా ఇలాంటి పరిస్థితి నాకే కాదు ప్రతి ఒక్కరికి పొంచి ఉంది. ఈరోజు ఒక మహిళగా, నటిగా, నాకు రక్షణగా మద్దతుగా ఉన్న నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, నా శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి నేను స్కూల్లోనూ, కాలేజీలోనూ, చదువుకుంటున్నప్పుడు ఎదురైతే నేనేం చేయగలనన్నది ఊహకందని విషయం. అందుకే ఇలాంటి విషయాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎంతోమంది ఈ డీప్ ఫేక్ వీడియోల బారిన పడకుండా రక్షించాలి" అంటూ తన పోస్టులో పేర్కొంది రష్మిక మందన.
దీంతో రష్మిక చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా కొందరు ఆకతాయిలు రష్మిక ఫోటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియోలో రష్మిక బాగా ఎక్స్పోజింగ్ చేసినట్టు కనిపించింది. వీడియో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనిపై కొందరు నెటిజన్స్ కి అనుమానం వచ్చి అసలు నిజాన్ని బయటపెట్టారు. ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి సంబంధించిందని తేల్చేశారు. ఆ వీడియోని ఎవరో రష్మిక ఫేస్ తో అనుమానం రాకుండా మార్నింగ్ చేసి రిలీజ్ చేసినట్లు గుర్తించారు. ఒరిజినల్ వీడియోని రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేశారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial