cVigil App Of ECI: ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీలు, నేతలు చేసే తప్పిదాలపై ఫిర్యాదుల కోసం ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సింపుల్ గా ఫిర్యాదులు చేసేందుకు మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ను 2018లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఉపయోగించారు. భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రారంభించిన కొత్త యాప్ సి-విజిల్ బ్రహ్మాస్త్రంగా మారనుంది. ఈ C-VIGIL యాప్ లో పేర్కొన్న అన్ని ఖాళీలను పూరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఫిర్యాదు స్వీకరణ చేయడంతో పాటు సత్వర పరిష్కార వ్యవస్థను రూపొందిస్తారు.
ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct), నేతల ఖర్చుల వ్యయ ఉల్లంఘనలు, రూల్స్ అతిక్రమించి ఏవైనా నేతలుగానీ, కార్యకర్తలు మరెవరైనా చేసే తప్పులపై ఫిర్యాదు చేయడానికి పౌరుల కోసం తీసుకొచ్చిన మొబైల్ యాప్ అప్లికేషన్ ఇది. C-VIGIL అంటే విజిలెంట్ సిటిజన్ ఇది స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో పౌరులు క్రియాశీలక పాత్రను తెలియజేప్పేందుకు ఛాన్స్ ఉంటుందని ఈసీ అధికారులు చెబుతున్నారు.
ఫిర్యాదు సమయంలో ఫొటో, వీడియో అప్లోడ్ చేసే సమయంలో ఫోన్లో జీపీఆర్ఎస్ ఆన్ చేసి ఉండాలి. ఫిర్యాదు చేసే వ్యక్తులు తమ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని సూచించారు. వారి వివరాలు గ్రూప్ లో ఉంటాయి. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన (EC Model Code of Conduct) జరిగినప్పుడు ఫొటో కానీ, 2 నిమిషాల నిడివి ఉన్న వీడియోలు కానీ యాప్ లో అప్లోడ్ చేయాలి. సీ విజిల్ యాప్ ద్వారా వివరాలు నేరుగా జిల్లా ఎన్నికల అధికారికి చేరుతాయి. అక్కడ ఆఫీసులో అందుబాటులో ఉండే సిబ్బంది అధికారులకు, సిబ్బందికి యాప్ లో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించనున్నారు. ఫిర్యాదుదారులకు కేటాయించిన ఐడీకి తిరిగి అప్ డేట్ పంపిస్తారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకి వచ్చే అంశాలు:
నేతలు, అభ్యర్థులు వారి అనుచరులు భౌతికంగా, మానసికంగాగానీ ఓటర్లను భయాందోళనకు గురిచేయడం
బహిరంగ సమావేశాల్లో విద్వేషపూరిత ప్రసంగాలతో ఓటర్లను రెచ్చగొట్టడం చేసినా కోడ్ ఉల్లంఘనే.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నేతలు, కార్యకర్తలు డబ్బు, మద్యం పంపిణీ చేయడం
ప్రచార గడువు ముగిసిన తర్వాత సైతం స్పీకర్లు వాడకం, ప్రలోభాల్లో భాగంగా వస్తువులు, సామాగ్రి పంపిణీ
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో బాధ్యత రహితంగా పని చేయడం.
ఎన్నికల ప్రచార నిబంధనలు ఉల్లంఘన.
పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏదైనా ఒక అంశంపై ఉల్లంఘన జరిగినా సామాన్యులు ఎవరైనా ఫిర్యాదు చేయడానికి అవకాశం కల్పించారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే ఫిర్యాదు చేయడం ద్వారా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగేందుకు దోహదపడిన వారు అవుతారని ప్రజలకు ఈసీ సూచించింది.
Also Read: తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ ప్రభావం ఎంత ? ప్రవీణ్ కుమార్ సంచలనం సృష్టిస్తారా ?
Also Read: పాలమూరును నాశనం చేసింది కాంగ్రెస్ - ఆలోచించి ఓటెయ్యాలన్న సీఎం కేసీఆర్