స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పలు గాడ్జెట్‌లను తయారు చేసే Xiaomi కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లోనూ దూసుకెళ్తోంది. షియోమీ కంపెనీ ఎలక్ట్రిక్ SUV Xiaomi YU7 కార్లను 3 నిమిషాల్లో 2 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఒక గంటల 2 లక్షల 89 వేల యూనిట్ల SUV Xiaomi YU7 బుకింగ్స్ తో దుమ్మురేపింది. Xiaomi మొదటి నెలలో 6 వేల మందికి పైగా కస్టమర్‌లకు ఈ ఎలక్ట్రిక్ SUVని డెలివరీ చేసింది.
బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. Xiaomi ఫౌండర్ లేయ్ జున్ మాట్లాడుతూ.. ఇక నుంచి YU7ని కొనుగోలు చేసేవారు ఇతర బ్రాండ్ కార్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేయవచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్ల తయారీ సంస్థ CEO అయినా తన కస్టమర్‌లను ఇతర కార్లను కొనుగోలు చేయాలని చెప్పడం ఇదే మొదటిసారి.
Xiaomi ఎలక్ట్రిక్ కారులో ప్రత్యేకత ఏంటి?
Xiaomi YU7 డిజైన్ దాని SU7 సెడాన్ ద్వారా ప్రేరణ పొంది అలా డిజైన్ చేసింది. ఇందులో పోర్షే మకాన్, ఫెరారీ పురోసాంగ్ వంటి హై-ఎండ్ కార్ల రూపురేఖలు కనిపిస్తాయి. SUV రెండు వేరియంట్‌లలో (రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD)) ప్రారంభించింది. ఈ SUVలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 288 kW ఎనర్జీతో పాటు 528Nm టార్క్‌ను జనరేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటి కారణంగా Xiaomi YU7 పనితీరు పరంగా బెస్ట్ అంటున్నారు.
Xiaomi YU7ని కంపెనీ 3 వేర్వేరు బ్యాటరీ వేరియంట్‌లతో వచ్చింది. ఇది కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా దాని పనితీరును, పరిధిని మెరుగు చేసుకుంటోంది. ఇందులో మొదటి వేరియంట్ 96.3kWh బ్యాటరీతో రాగా, ఇది రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌లో 835 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.
ఎలక్ట్రిక్ కారు రేంజ్, ధర వివరాలు
Xiaomi YU7 రెండవ వేరియంట్ 96.3kWh బ్యాటరీతో వస్తుంది. కానీ ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD ప్రో) సిస్టమ్ కలిగి ఉంటుంది. ఇది 760 కిలోమీటర్ల రేంజ్‌తో కారు కొనుగోలు చేయాలన్న వారిని ఆకట్టుకుంటోంది. మూడవ, అత్యంత శక్తివంతమైన వేరియంట్‌లో 101.7kWh బ్యాటరీ అమర్చారు. ఇది AWD మాక్స్ కాన్ఫిగరేషన్‌లో 770 కిలోమీటర్ల వరకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ తెలిపిన ఈ వివరాలు YU7ని ఫేమస్ కార్లు టెస్లా మోడల్ Y, ఇతర హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు దీటుగా నెట్టాయి.
ధర విషయానికి వస్తే Xiaomi YU7 ప్రారంభ ధర 2,53,500 యువాన్లు, భారత కరెన్సీలో దాదాపు 30 లక్షల రూపాయలు. ఇది టెస్లా మోడల్ Y కంటే 1.19 లక్షలు తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కారణాలతో Xiaomi YU7 ఎలక్ట్రిక్ కారు అటు సాంకేతికంగా మాత్రమే కాకుండా, మీ డబ్బును సైతం ఆదా చేస్తుంది. మిడ్-ప్రీమియం EV SUV విభాగంలోని కస్టమర్‌లకు ఈ బ్రాండ్ బెస్ట్ చాయిస్‌గా మారుతుంది. ట్రంప్ టారిఫ్‌లతో నెలకొన్న పరిస్థితులతో అమెరికాలో తయారైన కార్లను కొనుగోలు చేయకూడదని భావిస్తున్న వారు ఇతర దేశాల కార్ల వైపు చూస్తున్నారు.