International Left Handers Day 2025 : అందరూ కుడి చేతి వాటం కలిగి ఉంటారు. కానీ కొందరు మాత్రం ఎడమ చేతి వాటం కలిగి ఉంటారు. దీంతో వారు నలుగురిలో ఉన్నప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తారు. వారి గురించిన కొన్ని అంశాలపై అవగాహన కల్పిస్తూ.. అంతర్జాతీయంగా లెఫ్ట్ హ్యాండర్స్ డే జరుపుతున్నారు. మరి దీని చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి? ఇంతకీ లెఫ్ట్ హ్యాండ్​ ఎక్కువగా వాడడం వల్ల వారికి లాభామా? నష్టమా? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేద్దాం. 

చరిత్ర ఇదే

ఎడమ చేతి వాళ్ల రోజును సెలబ్రేట్ చేయడాన్ని ఎప్పుడో ప్రారంభించారు. ఎడమే చేతివాళ్ల ప్రత్యేకతను గుర్తించడం, వారు ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో దీనిని మొదలు పెట్టారు. 1976లో డీన్​ ఆర్. క్యాంప్​బెల్ అనే అమెరికన్ దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీన ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే జరుపుతున్నాము. 1992లో లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ అనే సంస్థ దీనిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. 

ప్రాముఖ్యతలివే.. 

ప్రపంచ జనాభాలో ఎడమచేతి వాటం కలిగిన వారు కేవలం 10% మాత్రమే ఉన్నారు. అయితే వీరికి ఎడమచేతి వాటం ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. అలాగే ఇబ్బందులు కూడా ఉన్నాయి. రైట్-హ్యాండ్-ఫ్రెండ్లీగా ఉండే ప్రపంచంలో వారు సిజర్స్, నోట్‌బుక్స్, కంప్యూటర్ మౌస్ వంటి పరికరాలు ఉపయోగించేప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వారి ప్రతిభ, సృజనాత్మకత, ప్రత్యేకమైన ఆలోచనా విధానాన్ని గుర్తించడమే ఈ స్పెషల్ డే ప్రధాన లక్ష్యం. 

ఎడమ చేతి వాళ్ల గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు.. 

మీకు తెలుసా? ఎడమ చేతి వాటం ఉండే చాలా మంది క్రియేటివ్, స్పోర్ట్స్లో ఎక్కువ నైపుణ్యం కలిగి ఉంటారట. అలాగే లెఫ్ట్ హ్యాండర్స్ మెదడులో కుడివైపు ఎక్కువ యాక్టివ్​గా ఉంటుందట. ఈ రైట్ బ్రెయిన్ యాక్టివ్​గా ఉండడం వల్ల ఆర్ట్, మ్యూజిక్, ఊహాలకు ఎక్కువ బూస్ట్ ఇస్తుందట. దీంతో వారు ఎక్కువ క్రియేటివ్​గా ఉంటారని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. వీరి భాష, లాజిక్ ప్రాసెసింగ్ కూడా కొంచెం భిన్నంగా జరుగుతుందని గుర్తించారు. ఐన్​స్టీన్ నుంచి బిల్​గేట్స్, సచిన్ టెండూల్కర్ వరకు ఎందరో ప్రముఖులు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. 

లాభాలు..

క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి ఆటల్లో ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేసే టెక్నిక్ వీరికి ఉంటుంది. సమస్యలను వేరే కోణంలో ఆలోచించే సామర్థ్యం ఉంటుంది. క్రియేటివ్​గా, ఇన్నోవేటివ్​గా ఆలోచిస్తారు. మల్టీటాస్కింగ్ చేసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

ఇబ్బందులు..

రైట్ హ్యాండ్ టూల్స్ వినియోగించడం వల్ల కాస్త అసౌకర్యం ఉంటుంది. టీచింగ్ పద్ధతుల్లో కూడా కాస్త ఇబ్బంది ఎదుర్కొంటారు. అయితే ఎడమ చేతి వాటం ఉండే అందరికీ అన్ని ప్రయోజనాలు ఉండవని గుర్తించుకోవాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.