Tata Punch Price, Mileage And Features In Telugu: పండుగ సీజన్ ముందు, టాటా మోటార్స్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. టాటా బ్రాండ్‌లో పాపులర్ మోడల్ Punch SUV కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల (ఆగస్టు 2025)లో టాటా పంచ్ SUV మంచి డిస్కౌంట్‌తో (Tata Punch Discount August 2025) లభిస్తుంది. దీనితో పాటు, Tata Punch CNG పై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది.
టాటా పంచ్ ఔట్ లుక్ కాంపాక్ట్ SUV స్టాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో ఉన్న బోల్డ్ గ్రిల్ & స్టైలిష్ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్ దీనికి మోడ్రన్ లుక్ ఇస్తాయి. స్పోర్టీ అలాయ్ వీల్స్ & చక్కటి శిల్పం తరహా బాడీ లైన్స్ దీనిని మరింత ప్రీమియం లుక్‌లో చూపిస్తాయి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల టాటా పంచ్ నగర రోడ్లపైనే కాదు, గ్రామీణ మార్గాల్లోనూ సులభంగా నడుస్తుంది.
ఆగస్టులో కొంటే ఈ కారుపై ఎంత తగ్గింపు లభిస్తుంది?ఆగస్టు 2025లో, టాటా పంచ్ CNG వేరియంట్లపై గరిష్టంగా రూ. 85,000 వరకు డిస్కౌంట్ స్కీమ్ వర్తిస్తుంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 అదనపు స్క్రాపేజ్ బోనస్ & రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. టాటా పంచ్ పెట్రోల్ వేరియంట్లు కొన్నవారికి రూ. 65,000 వరకు తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ఆన్-రోడ్ ధర తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ధర రూ. 6.20 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది. కారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో టాటా పంచ్ ఆన్-రోడ్ ధర (Tata Punch on-road price, Hyderabad) దాదాపు రూ. 7.43 లక్షలు అవుతుంది. విజయవాడలో దాదాపు రూ. 7.46 లక్షలు (Tata Punch on-road price, Vijayawada) అవుతుంది.
టాటా పంచ్ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 6,700 rpm వద్ద 87.8 PS పవర్‌ను & 3,150 నుంచి 3,350 rpm వరకు 115 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ వాహనం ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కూడా ఉంది.
టాటా పంచ్ మైలేజ్పెట్రోల్ వేరియంట్‌లో, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో టాటా పంచ్ ARAI సర్టిఫైడ్ మైలేజ్ 20.09 kmpl. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో, ఈ కారు 18.8 kmpl మైలేజ్ ఇస్తుంది. టాటా పంచ్ CNG ARAI సర్టిఫైడ్ మైలేజ్ 26.99 km/kg.
టాటా పంచ్ ఫీచర్లుటాటా పంచ్ SUVలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 26.03 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయడానికి వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. టాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది, ప్రయాణీకుల భద్రత విషయంలో ఇది అత్యుత్తమ రేటింగ్.