Tata Altroz vs Maruti Baleno vs Hyundai i20 Mileage Check: టాటా మోటార్స్ కొత్త Altroz 2025 అప్‌డేటెడ్ వెర్షన్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది & అది మారుతి బాలెనో, హ్యుందాయ్ i20 & టయోటా గ్లాంజా (Tayota Glanza)కు టఫ్ ఫైట్ ఇస్తోంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో మైలేజ్ పరంగా ఏది బెస్ట్ అన్నది చాలామందిలో ఉన్న సందేహం.
CNG సెగ్మెంట్
CNG విభాగంలో మైలేజ్ పరంగా చూస్తే... బాలెనో & గ్లాంజా ముందంజలో ఉన్నాయి. ఈ రెండూ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పని చేస్తాయి. ఈ ఇంజిన్ 76.4 bhp పవర్‌ను & 98.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, ఈ రెండు బండ్లు CNGతో అద్భుతంగా 30.61 km/kg మైలేజీని ఇస్తున్నాయి. మరోవైపు, ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది, ఇది 72.4 bhp పవర్‌ను & 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని CNG వెర్షన్ మైలేజ్ 26.90 km/kg. అయితే, ఆల్ట్రోజ్‌లో 60-లీటర్ల డ్యూయల్ సిలిండర్ ట్యాంక్ ఉంది. బాలెనో & గ్లాంజా కార్లలో 55-లీటర్ సింగిల్ సిలిండర్ ట్యాంక్ మాత్రమే ఉంది. అంటే, ఆల్ట్రోజ్‌కు లాంగ్ రేంజ్ బెనిఫిట్ లభించింది. ప్రస్తుతం, హ్యుందాయ్ i20 కారు CNG వెర్షన్‌లో అందుబాటులో లేదు.
డీజిల్ సెగ్మెంట్
డీజిల్ సెగ్మెంట్‌లో మైలేజ్ గురించి మాట్లాడుకుంటే... ఈ విభాగంలో ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్ అదరగొడుతోంది. ఈ కారుకు 1.5 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 88.7 bhp పవర్‌ను & 200 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, డీజిల్ వెర్షన్‌లో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మైలేజ్ 23.60 kmpl. ప్రస్తుతం.. బాలెనో, i20 రెండింటిలోనూ డీజిల్ వెర్షన్ లేదు. అంటే, ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్ లాంగ్ రేంజ్ డ్రైవర్లు & హైవే యూజర్లకు అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.
పెట్రోల్ సెగ్మెంట్
పెట్రోల్ వెర్షన్‌లో.. టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో, హ్యుందాయ్ i20 - ఈ మూడు కార్లు 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో దూకుడుగా ఉన్నాయి. కానీ సిలిండర్లలో తేడా ఉంది. టాటా ఆల్ట్రోజ్‌లో 3-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది, దీని మైలేజ్ లీటర్‌కు 18–20 కి.మీ. అని అంచనా. మారుతి బాలెనో పెట్రోల్ వెర్షన్ 4-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది మాన్యువల్ (MT) వెర్షన్‌లో 22.35 కి.మీ. & ఆటోమేటిక్ (AMT) వెర్షన్‌లో 22.94 కి.మీ. సూపర్ మైలేజీ ఇస్తుంది. హ్యుందాయ్ i20 పెట్రోల్ వెర్షన్ కూడా 4-సిలిండర్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది & కంపెనీ డేటా ప్రకారం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 20 కి.మీ. మైలేజీని ఇస్తుంది.
మైలేజ్ రేసులో ఏది బెస్ట్?
సాధారణంగా, మైలేజ్ అంటే మారుతినే గుర్తుకు వస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. మారుతి బాలెనో, మైలేజ్ పరంగా, CNG & పెట్రోల్ వెర్షన్లలో ముందుంది. అదే సమయంలో, ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్ ఈ విభాగంలో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది & దీర్ఘకాలిక వినియోగానికి ఇది ఒక గొప్ప ఎంపిక. హ్యూందాయ్ i20 లుక్స్ & ఫీచర్లలో మెరుగ్గా ఉంది, కానీ మైలేజ్ పరంగా బాలెనో & ఆల్ట్రోజ్ కంటే వెనుకబడి ఉంది.