రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పటినుంచో కోరుకుంటున్న అప్డేట్ ఇవాళ వచ్చేసింది. 'ది రాజా సాబ్' రిలీజ్ డేట్ చెప్పేశారు. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వచ్చేది తెలిపారు.
డిసెంబర్ 5న థియేటర్లలోకి 'ది రాజా సాబ్'అవును... డిసెంబర్ 5న 'ది రాజా సాబ్' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు హీరో ప్రభాస్ తెలిపారు. తన సోషల్ మీడియా అకౌంట్‌లో రిలీజ్ డేట్ పోస్టర్ పోస్ట్ చేశారు. డిసెంబర్ 5న థియేటర్లలో కలుద్దామని ప్రభాస్ పేర్కొన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు.
Also Read: రాజేంద్ర ప్రసాద్‌ను క్షమించిన అలీ... పుట్టెడు దుఃఖంలో ఉన్నారు... వదిలేయండి!
సినిమా విడుదల తేదీ తో పాటు టీజర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది 'ది రాజా సాబ్' టీం. జూన్ 16న టీజర్ రిలీజ్ చేస్తామని చెప్పింది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రమిది. తెలుగుతోపాటు హిందీ, తమిళ మలయాళ కన్నడ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు'ది రాజా సాబ్' సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. హారర్ కామెడీగా రూపొందుతున్న చిత్రమిది. కామెడీ సినిమాలు తీయడంలో దర్శకుడు మారుతి స్పెషలిస్ట్. 'భలే మంచి రోజు' నుంచి మొదలు పెడితే 'మహానుభావుడు', 'ప్రతి రోజూ పండగే' వరకు ఆయన తీసిన సినిమాలను అంత త్వరగా మరువగలమా? ప్రతిదీ నవ్వించింది. హారర్ కామెడీ అంటే మారుతి తీసిన 'ప్రేమ కథా చిత్రం' ఒక బెంచ్ మార్క్ అయ్యింది. అందుకని, 'ది రాజా సాబ్' సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ