SUVs in January 2024: 2024 మొదటి నెలలో అనేక కొత్త కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ కొత్త జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్‌ను ముందుగా లాంచ్ చేస్తుంది. అయితే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అప్‌డేటెడ్ మహీంద్రా ఎక్స్‌యూవీ300, కియా సోనెట్ లాంచ్ కానున్నాయి. హ్యుందాయ్ క్రెటా మిడ్ లైఫ్‌సైకిల్ అప్‌డేట్‌ను కూడా పొందుతుంది. ఈ నెలలో జరిగే అన్ని కొత్త కార్ల లాంచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్
ఈ కారు జనవరి 8వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. కొత్త జీఎల్ఎస్ ఎస్‌యూవీ గ్రిల్ సిల్వర్ షాడో ఫినిషింగ్‌లో అందించిన నాలుగు కొత్త హారిజాంటల్ లౌవ్‌లను పొందింది. వెలుపలి కంటే లోపలికి మరిన్ని అప్‌డేట్లు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద అప్‌గ్రేడ్ ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇతర మార్పుల్లో షైనింగ్ బ్రౌన్ లైమ్ వుడ్ ట్రిమ్‌లోని కొత్త అప్హోల్స్టరీ ట్రీలు, 360 డిగ్రీ కెమెరా, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4మ్యాటిక్ ఏడబ్ల్యూడీ సిస్టమ్‌తో 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లను పొందే అవకాశం ఉంది.


హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్
హ్యుందాయ్ ఇండియా స్పెక్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 16వ తేదీన మార్కెట్లోకి రానుంది. దీని లోపల, బయట చాలా మార్పులు కనిపిస్తాయి. దీని డిజైన్ గ్లోబల్ మోడల్ పాలిసాడ్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ఇది రీడిజైన్ చేసిన గ్రిల్, కొత్త వెర్టికల్ స్ప్లిట్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, హారిజంటల్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. ఇది ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా, అప్‌డేట్ చేసిన 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఇంజన్‌తో పాటు 160 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది.


కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్
సోనెట్ ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇది జనవరి మధ్యలో లాంచ్ కానుంది. దీని ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు ఉండవు. ఇది లెవెల్ 1 ఏడీఏఎస్, కొత్త 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరికొన్ని కొత్త ఫీచర్లను పొందుతుంది. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధరలు కూడా ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చని అంచనా.


మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా దీన్ని మరింత ఆధునికంగా చేయడానికి ఇంటీరియర్‌లో కూడా మార్పులు చేస్తుంది. ఇది పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందే అవకాశం ఉంది. దీని ఇంజన్ సెటప్‌లో ఎలాంటి మార్పు ఉండదు.


మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా లాంచ్ చేసిన ఒక సంవత్సరంలోనే ఎక్స్‌యూవీ400కి అనేక చిన్న అప్‌డేట్లు చేసింది. అయినప్పటికీ ఇది కంపెనీకి నెమ్మదిగా అమ్ముడవుతున్న మోడల్‌గా మిగిలిపోయింది. రాబోయే ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ జనవరి నెలాఖరులో లాంచ్ కానుంది. దాని క్యాబిన్, ఫీచర్లలో మరిన్ని అప్‌డేట్స్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేసే పెద్ద 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. కొత్త 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కూడా అందుబాటులో ఉంటాయి.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!