Most Awaited Hybrid SUVs: భారతీయ కారు కస్టమర్లలో హైబ్రిడ్ కార్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో హైబ్రిడ్ కార్ల విక్రయాలు ఏకంగా 400 శాతం పెరిగాయి. ఇందులో క్రెడిట్ టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మారుతి సుజుకి ఇన్విక్టో, హోండా సిటీ వంటి కొత్త హైబ్రిడ్ మోడళ్లకు దక్కుతుంది. హైబ్రిడ్ ఫ్యామిలీ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రాబోయే కాలంలో నాలుగు కొత్త 7 సీటర్ SUVలు మార్కెట్లోకి రానున్నాయి.


కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్ (Upcoming Toyota Fortuner)
2024లో మార్కెట్లోకి రానున్న కొత్త తరం టయోటా ఫార్చ్యూనర్ 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇటీవలే కొత్త టయోటా హైలక్స్ ఎంహెచ్ఈవీలో అందించిన ఈ ఇంజిన్ ఫార్చ్యూనర్‌తో కూడా అందిస్తారని భావిస్తున్నారు. 204 పీఎస్ పవర్, 420 ఎన్ఎం టార్క్‌తో కొత్త ఫార్చ్యూనర్ టీఎన్‌జీఏ-ఎఫ్ ప్లాట్‌ఫారమ్‌పై దీన్ని నిర్మించనున్నారు. ఇందులో అధునాతన డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హైడ్రాలిక్ స్టీరింగ్ వీల్ సౌకర్యం ఉంటుంది.


ఫోక్స్‌వాగన్ టారోన్ (Upcoming Volkswagen Taron)
ఫోక్స్‌వాగన్ టారోన్ 7 సీటర్ ఎస్‌యూవీ 2025 ప్రారంభంలో భారతదేశ రోడ్లపైకి రానుంది. ఎంక్యూబీ-ఎవో ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఈ ఎస్‌యూవీ ప్రపంచవ్యాప్తంగా కూపే ఎస్‌యూవీ బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో ఇది 5, 7 సీటింగ్ కాన్ఫిగరేషన్‌లతో సీకేడీ యూనిట్‌లుగా అందించబడుతుంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌లతో 48V మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఈ ఎస్‌యూవీ 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 2డబ్ల్యూడీ, ఏడబ్ల్యూడీ డ్రైవ్‌ట్రెయిన్‌తో వస్తుంది.


కొత్త టయోటా 7 సీటర్ ఎస్‌యూవీ (New Toyota Car)
టయోటా కిర్లోస్కర్ మోటార్ కరోలా క్రాస్ ఆధారంగా మూడు వరుసల ఎస్‌యూవీని పరిచయం చేయబోతున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఇన్నోవా హైక్రాస్ ప్లాట్‌ఫారమ్‌తో ఇది 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను పొందే అవకాశం ఉంది. కొత్త ఎస్‌యూవీ ఈ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది లీటరుకు 23 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.


కొత్త మారుతి 7 సీటర్ ఎస్‌యూవీ (Upcoming Maruti 7 Seater SUV)
గ్రాండ్ విటారా ఆధారంగా మారుతి సుజుకి ప్రీమియం మూడు వరుసల ఎస్‌యూవీని సిద్ధం చేస్తున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. గ్రాండ్ విటారా ప్లాట్‌ఫారమ్, ఫీచర్లు, ఇంజిన్‌ను ఈ మోడల్‌లో ఉపయోగించవచ్చు. ఇది 103 బీహెచ్‌పీ, 115 బీహెచ్‌పీ పవర్‌ని ఉత్పత్తి చేసే 1.5 లీటర్ కే15సీ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ సెటప్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. ఇది రాబోయే కొన్నేళ్లలో మార్కెట్లోకి విడుదల అవుతుందని భావిస్తున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply


Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!


Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!