సినిమా హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కొందరు హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు సినిమాలు బాగున్నా.. సరైన ప్రమోషన్స్ లేక లేదా.. హీరోకు ముందు హిట్లు లేక ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం సుధీర్ బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈ రెండిటిలో ఒకటి కూడా పూర్తిస్థాయిలో హిట్ సాధించలేదు. అయినా అదేమీ పట్టించుకోకుండా ‘హరోం హర’ అనే మరో చిత్రాన్ని ప్రారంభించాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కానుందని ఫ్రెష్ అప్డేట్‌ను అందించాడు సుధీర్ బాబు.
ప్యాన్ ఇండియా రేంజ్‌లో..
సుధీర్ బాబు హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తన స్పీడ్‌ను మాత్రం తగ్గించలేదు. అలాగే త్వరలో ‘హరోం హర’ అనే చిత్రంతో రాబోతున్నాడు ఈ హీరో. కెరీర్‌లో మొదటిసారి తన చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా విడుదల చేయడానికి సుధీర్ బాబు సిద్ధమయ్యాడు. కేవలం తెలుగులో మాత్రమే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ‘హరోం హర’ విడుదల కానుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు కేవలం పోస్టర్స్ మాత్రమే విడుదల కాగా.. టీజర్ రిలీజ్ డేట్‌ను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు సుధీర్ బాబు.
పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం..
‘పవర్ ఆఫ్ సుబ్రహ్మణ్యం’ పేరుతో ‘హరోం హర’ మూవీ టీజర్ విడుదలకు సిద్ధమయ్యింది. నవంబర్ 27 టీజర్ విడుదల కానున్నట్టు సుధీర్ బాబు ప్రకటించాడు. ‘హరోం హర యూనివర్స్‌కు సంబంధించి ఇది చిన్న గ్లింప్స్. సుబ్రహ్మణ్యం పవర్‌ను చూడండి’ అనే క్యాప్షన్‌తో టీజర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు. ‘సెహరీ’లాంటి యూత్‌ఫుల్ సినిమాతో హిట్ కొట్టిన జ్ఞానసాగర్ ద్వారక.. ‘హరోం హర’కు దర్శకత్వం వహిస్తున్నాడు. సుమంత్ జీ నాయుడు.. ఈ చిత్రానికి నిర్మాతకు వ్యవహరిస్తున్నాడు. తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే చేతన్ బరద్వాజ్.. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్..
2023 మొదట్లో ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు సుధీర్ బాబు. ఈ మూవీ కాస్త పరవాలేదు అనే టాక్‌ను సంపాదించింది. అంతే కాకుండా మునుపెన్నడూ లేని విధంగా ‘హంట్’లో సుధీర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఒక బ్లాక్‌బస్టర్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కడమే ‘హంట్’కు నెగిటివ్‌గా మారింది. అందుకే ఎక్కువరోజులు బాక్సాఫీస్ రన్‌ను నిలబెట్టుకోలేకపోయింది. ఇక తాజాగా ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు సుధీర్ బాబు. మూడు డిఫరెంట్ రోల్స్‌లో వైవిధ్యభరితంగా కనిపించడానికి సుధీర్ కష్టపడినా.. సినిమా బోరింగ్‌గా ఉందంటూ నెగిటివ్ రివ్యూలతో ఫ్లాప్ అయ్యింది. అందుకే సుధీర్ ఆశలన్నీ ‘హరోం హర’పైనే ఉన్నాయి. ఇప్పటివరకు విడులదయిన పోస్టర్స్ చూస్తుంటే.. ఇది కూడా కమర్షియల్ చిత్రమని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: నీ సమస్య పరిష్కర్కిస్తే నాకేం ఇస్తావు అన్నాడు - ఆ సెలబ్రిటీపై శ్రీ సుధా షాకింగ్ కామెంట్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply