ఓ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తనను మోసం చేశాడంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీ సుధ.. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనపై కేసు కూడా పెట్టింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆ ఘటనకు సంబంధించి శ్రీ సుధకు ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె ఆ ఘటన గురించి వివరించింది.
వాడికి బుద్ధి లేదు..
పెళ్లయిన వ్యక్తితో మీరు ఎలా ముందుకెళ్లారు అనే ప్రశ్నకు శ్రీ సుధా చాలా ఘాటుగా సమాధానమిచ్చింది. ‘‘నేను వెళ్లలేదు ఫస్ట్ వాడే వచ్చాడు. వాడికి పెళ్లయ్యింది. నాకు కాదు. పెళ్లయినవాడివి నీకెందుకు ఇవన్నీ అని వాడిని అడగాలి. ఇది తప్పు ప్రశ్న. నేను సింగిల్. ఒక తోడు కోసం వెయిట్ చేస్తా. నా తప్పు కాదు. పెళ్లాన్ని పెట్టుకొని వస్తున్నందుకు వాళ్లకు ఉండాలి ఆ బుద్ధి. పెళ్లాంతో మనస్పర్థలు ఉన్నాయని తెలుసు. హ్యాపీ లైఫ్‌లోకి నేను ఎంటర్ అవ్వలేదు. విడాకులు తీసుకో అని నేను బలవంతపెట్టలేదు. మొదట్లో ఫ్రెండ్లీగానే ఉన్నాం. ఫిజికల్ రిలేషన్ అనేది చాలారోజుల తర్వాత జరిగింది’’ అని ఓపెన్‌గా చెప్పింది సుధా.
వె*వలా ప్రవర్తించాడు..
ఆ సినిమాటోగ్రాఫర్ అన్న గురించి కూడా మాట్లాడింది సుధా. ‘‘వాళ్లకి ఫ్యామిలీ పరువు అనేది లేదు. ఈ విషయం గురించి మాట్లాడడానికి నేను వాళ్ల అన్న దగ్గరకు రెండుసార్లు వెళ్లాను. నీకు సమస్య పరిష్కరిస్తే నాకేం ఇస్తావు అని అడిగాడు. అలాంటి వె*వకు మర్యాదలు ఎందుకు? ఆ విషయం వాళ్ల తమ్ముడికి కూడా చెప్పాను. నేను మా అన్నతో మాట్లాడడం లేదని అన్నాడు. అది నిజమో కాదో నాకు తెలియదు కదా’’ అని షాకింగ్ విషయాలు బయటపెట్టింది. అయితే తను పోరాడింది డబ్బు గురించి కాదని, న్యాయం కావాలి అని మాత్రమే అందరి ముందు చెప్పానని గుర్తుచేసింది.
మేయిర్ పీఏ అలా చేశాడు..
తనపై లీగల్‌గా యాక్షన్ తీసుకుందామని పోలీసుల దగ్గరకు వెళ్లినప్పుడు కూడా తను సరిగా రెస్పాండ్ అవ్వలేదని, అందుకే మీడియాను అప్రోచ్ అయ్యానని చెప్పింది సుధా. లీగల్‌గా న్యాయం జరుగుతుందని కచ్చితంగా నమ్ముతున్నానని చెప్పింది. ఈ కేసు ఫైల్ చేయడానికి పోలీసుల దగ్గరకు వెళ్తే.. లంచం అడిగినందుకు ఆఫీసర్‌పై కూడా కేసు పెట్టింది సుధా. ఎవరికైతే తను డబ్బులు ఇచ్చిందో.. తను ఇప్పుడు మేయర్‌కు పీఏగా పనిచేస్తున్నాడని బయటపెట్టింది. మేయర్ ఎలా అపాయింట్ చేసుకుందో అని ఆశ్చర్యపోయింది. లంచం ఇవ్వకపోతే ఛార్జ్‌షీట్ వేయను అన్నాడని రూ.5 లక్షలు ఇచ్చానని చెప్పింది సుధా. ఇండియా అభివృద్ధి చెందకపోవడానికి లంచమే కారణం అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఎన్నో తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన శ్రీ సుధా.. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
Also Read: ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెడుతున్న చివరి కెప్టెన్సీ టాస్క్ - ప్రియాంక మౌనం!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply