New Car Launching in this Week: పండుగ సీజన్ ప్రారంభంతో అక్టోబర్‌లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి. ఈ కార్లలో ఎక్కువ భాగం ప్రీమియం సెగ్మెంట్ నుంచి ఉంటాయి. మీరు కూడా పండుగ సందర్భంగా కొత్త కారును ఇంటికి తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కార్ల గురించి తెలుసుకుందాం. ఈ నెలలో లాంచ్ కానున్న కొన్ని కొత్త కార్ల గురించి ఇక్కడ చెప్పుకుందాం.


కియా ఈవీ9 (Kia EV9)
కియా ఈవీ9 ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది రేపు భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. అక్టోబర్ 3వ తేదీన ఈ కారు మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. మీరు 99.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతారు. ఇది 561 కిలోమీటర్ల ఏఆర్ఏఐ మైలేజీని అందిస్తుంది. ఇది డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది.


కియా ఈవీ9 ఆల్-వీల్ డ్రైవ్(AWD)ని అందిస్తుంది. ఈ కారు శక్తి 384 హెచ్‌పీ పవర్, టార్క్ 700 ఎన్ఎం పీక్ టార్క్‌ను డెలివర్ చేయనుంది. కియా ఈవీ9 లెగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో 6-సీటర్ లేఅవుట్‌తో వస్తుంది. ఇది సీబీయూగా మార్కెట్లో లాంచ్ కానుంది. దీని ధర సుమారు రూ. కోటి (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.


Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?


కొత్త కియా కార్నివాల్ (Kia Carnival)
ఈ లిస్టులో రెండో కారు కియా కార్నివాల్. ఇది కొత్త తరం మోడల్‌తో మార్కెట్లోకి రానుంది. మునుపటి మోడల్‌ను 2023 జూన్‌లో నిలిపివేశారు. కానీ ఇప్పుడు కియా కొత్త కారు మరింత లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. మొదట లిమోసిన్, లిమోసిన్ ప్లస్ అనే రెండు ట్రిమ్‌ల్లో లాంచ్ కానుంది. ఈ కారు అక్టోబర్ 3వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది.


నిస్సాన్ మాగ్నెట్ ఫేస్‌లిఫ్ట్ (Nissan Magnite Facelift)
జాబితాలో మూడో కారు నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్. ఇది అక్టోబర్ 4వ తేదీన లాంచ్ కానుంది. నిస్సాన్ మాగ్నైట్ కొత్త మోడల్ కొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు కారు హెడ్‌లైట్‌ల్లో కూడా అనేక కొత్త మార్పులు చూడవచ్చు. ఈ నిస్సాన్ కారు ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ 72 హెచ్‌పీ పవర్‌ను, టర్బో ఇంజన్ 100 హెచ్‌పీ పవర్‌ను డెలివర్ చేయనుంది. 


పండుగ సీజన్‌లో కారును లాంచ్ చేస్తే ప్రజలు కొత్త కారును కొనడానికి ఇష్టపడతారు కాబట్టి ఇవి ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒక్క వారంలోనే ఇన్ని కార్లు లాంచ్ కానున్నాయి.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే