Women's T20 World Cup 2024 Full schedule and details :
మహిళల టీ 20 ప్రపంచకప్‌కు(Womens T20 World Cup 2024) అంతా సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కప్పును కైవసం చేసుకోవాలని సంకల్పంతో ఉన్న పది జట్లు.. ఉత్కంఠభరిత పోరాటాలకు సిద్ధమయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో జరుగుతున్న ఈ టోర్నమెంట్ అక్టోబర్ 3న షార్జా క్రికెట్ స్టేడియంలో స్కాట్లాండ్‌తో ఆతిథ్య దేశం బంగ్లాదేశ్(BAN)తో తలపడుతుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(AUS) మరోసారి కప్పు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉండగా... టీమిండియా(IND) తొలిసారి విశ్వ విజేతలుగా నిలవాలని పట్టుదలతో ఉంది. పూర్వ వైభవం కోసం పాక్.. మరో కప్పు కోసం ఇంగ్లాండ్... ఈసారి కప్పు వదలకూడదనే సంకల్పంతో న్యూజిలాండ్ ఇలా ప్రతీ జట్టు కప్పు పైనే కన్నేసింది. దీంతో ఈసారి భీకర పోరాటాలు ఖాయంగా కనిపిస్తుంది.
భారత జట్టుపై భారీ అంచనాలు
టీ 20 ప్రపంచకప్‌ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఓసారి ఫైనల్ చేరిన భారత జట్టు.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈసారి మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా కప్పు ఒడిసిపట్టాలని కసితో ఉంది. అక్టోబర్ 4న తమ న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్‌తో భారత పోరాటం ప్రారంభం కానుంది.
భారత జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తిక భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధాయాంక పాటిల్,, సజన సజీవన్
పూర్తి షెడ్యూల్..
అక్టోబర్ 3, మధ్యాహ్నం 3:30: బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్ (షార్జా స్టేడియం)
అక్టోబర్ 3, రాత్రి 7:30: పాకిస్థాన్ vs శ్రీలంక (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 4, మధ్యాహ్నం 3:30: సౌతాఫ్రికా vs వెస్టిండీస్ (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 4, రాత్రి 7:30 ఇండియా vs న్యూజిలాండ్ (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 5, మధ్యాహ్నం 3:30: ఆస్ట్రేలియా vs శ్రీలంక (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 5, రాత్రి 7:30: బంగ్లాదేశ్ vs ఇంగ్లండ్ (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 6, మధ్యాహ్నం 3:30: భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 6, రాత్రి 7:30: వెస్టిండీస్ vs స్కాట్లాండ్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 7, రాత్రి 7:30: ఇంగ్లాండ్ vs సౌతాఫ్రికా -(షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 8, రాత్రి 7:30: ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్ - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 9, మధ్యాహ్నం 3:30: దక్షిణాఫ్రికా vs స్కాట్లాండ్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 9, రాత్రి 7:30: భారత్ vs శ్రీలంక - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 10, రాత్రి 7:30: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 11, రాత్రి 7:30: ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 12, మధ్యాహ్నం 3:30: న్యూజిలాండ్ vs శ్రీలంక - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 12, రాత్రి 7:30: బంగ్లాదేశ్ vs సౌతాఫ్రికా - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 13, మధ్యాహ్నం 3:30: ఇంగ్లండ్ vs స్కాట్లాండ్ - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 13, రాత్రి 7:30: భారత్ vs ఆస్ట్రేలియా - (షార్జా క్రికెట్ స్టేడియం)
అక్టోబర్ 14, 7:30 pm: పాకిస్తాన్ vs న్యూజిలాండ్ - (దుబాయ్ స్టేడియం)
అక్టోబర్ 15, రాత్రి 7:30: ఇంగ్లండ్ vs వెస్టిండీస్ -(దుబాయ్ స్టేడియం)
సెమీఫైనల్ 1: గ్రూప్ A విజేత vs గ్రూప్ B రన్నరప్ ((దుబాయ్ స్టేడియం)
సెమీఫైనల్ 2: గ్రూప్ B విజేత vs గ్రూప్ A రన్నరప్ (అక్టోబర్ 18, రాత్రి 7:30--షార్జా క్రికెట్ స్టేడియం)
ఫైనల్: సెమీఫైనల్ 1 విజేత vs సెమీఫైనల్ 2 విజేత (అక్టోబర్ 20, రాత్రి 7:30 - దుబాయ్ స్టేడియం)
ఏ ఛానెల్ ప్రసారం చేస్తుంది?
మహిళల T20 ప్రపంచ కప్ 2024 భారతదేశంలోని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తుంది.
ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ?
T20 ప్రపంచ కప్ 2024 ప్రత్యక్ష ప్రసారం Disney+ Hotstar యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.