Triumph Motorcycles: ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో తన కొత్త బైక్‌కు గొప్ప స్పందనను అందుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో విడుదలైన 10 రోజుల్లోనే ఈ బైక్ 10,000 యూనిట్ల బుకింగ్‌లను అందుకుంది. 2023 జూన్ 27వ తేదీన లండన్‌లో డిస్‌ప్లే చేసిన స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 మోడల్స్‌కు భారత మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు.


జులై 5వ తేదీన ట్రయంఫ్ స్పీడ్ 400 భారతదేశంలో రూ. 2.33 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అయింది. మొదటి 10 వేల మంది వినియోగదారులకు ఈ బైక్‌ను రూ. 2.23 లక్షల ధరకే విక్రయించనున్నారు. ఇంత ఆకర్షణీయమైన ధర కారణంగా కస్టమర్లలో ఉత్సాహం పెరిగింది. దీని కారణంగా బుకింగ్స్ కూడా చాలా బాగా ఊపందుకున్నాయి. అక్టోబర్‌లో విడుదల కానున్న స్క్రాంబ్లర్ 400 ధరలను ఇంకా ప్రకటించలేదు. 


దీన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలంటే కంపెనీ అధికారిక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను సందర్శించి రూ.2,000 మొత్తంతో తమ బుకింగ్‌ను పూర్తి చేయాలి. స్పీడ్ 400 బైక్‌ను డెలివరీ తీసుకునే మొదటి 10 వేల మంది కస్టమర్లు బైక్ ప్రారంభ ధరను చెల్లిస్తే సరిపోతుంది.


రాబోయే కొద్ది నెలల్లో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 మోడల్స్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన బుకింగ్‌లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. బజాజ్ ఆటో కొత్త మోటార్‌సైకిళ్లను పరిచయం చేయడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. భారతదేశంలో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణిస్తుందని అందరూ భావిస్తున్నారు.


కేటీయం 390 అడ్వెంచర్‌తో ట్రయంఫ్ 400 స్పీడ్ పోటీపడనుంది. ఇది 373.6 సీసీ ఇంజన్‌ను పొందుతుంది. ఈ బైక్ ధర రూ. 2.81 లక్షలుగా ఉంది. అయితే ఇది ఎక్స్ షోరూం ధర. ఆన్ రోడ్ ధర ఇంత కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.


















Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial