Instagram Live Activity: మెటా సంస్థ ఇటీవల థ్రెడ్స్ యాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ యాప్‌ ఇప్పటికే 80 మిలియన్ల యూజర్‌బేస్‌ను దాటింది. థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కి లింక్ అయి ఉంది. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ సహాయంతో థ్రెడ్స్‌లో లాగిన్ చేయవచ్చు.


స్టేటస్ యాక్టివిటీ స్క్రీన్ మీదనే...
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో మెటా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌ని లైవ్ యాక్టివిటీ అంటారు. కంపెనీ ప్రస్తుతం దీన్ని ఐవోఎస్‌లో పరీక్షిస్తోంది.మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైనా ఫొటో లేదా వీడియోను పోస్ట్ చేసినప్పుడల్లా దాని అప్‌లోడింగ్ స్టేటస్ ఎంత వరకు ఉందో లాక్ స్క్రీన్, హోమ్‌స్క్రీన్‌పై లైవ్ యాక్టివిటీ ద్వారా చూడవచ్చు.


ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పుడు దాని అప్‌లోడింగ్ స్టేటస్‌ను చూడటానికి యాప్‌ని మళ్లీ మళ్లీ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. యాప్‌ని ఓపెన్ చేయకపోతే అది కనిపించదు. కానీ ఇప్పుడు ఐవోఎస్ యూజర్లు లైవ్ యాక్టివిటీ ఫీచర్ వచ్చిన తర్వాత లాక్‌స్క్రీన్‌లో పోస్ట్ అప్‌లోడింగ్ స్టేటస్‌ను చూడవచ్చు. ఈ విషయాన్ని 9to5Mac రీడర్ ఫెర్నాండో మోరెట్టో మొదట నివేదించారు.


లాక్ స్క్రీన్‌తో పాటు డైనమిక్ ఐలాండ్‌లో కూడా...
దీని సాయంతో వినియోగదారులు లాక్ స్క్రీన్, డైనమిక్ ఐలాండ్ రెండింటిలోనూ ఇన్‌స్టాగ్రామ్ యాప్ లైవ్ యాక్టివిటీని చూడగలరు. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి రానుంది.


రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల వినియోగదారులకు 'డౌన్‌లోడ్' ఆప్షన్‌ను ఇచ్చింది. ఈ ఫీచర్ ప్రస్తుతం యూఎస్ఏ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. వినియోగదారులు ఇప్పుడు ఒక క్లిక్‌తో పబ్లిక్ రీల్స్‌ను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం వారు దాన్ని స్టోరీలో షేర్ చేసి అక్కడ నుంచి సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.


మెటా గత నెలలో 'Why Am I Watching This?' అనే ఆప్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్‌కు చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్ పేజీలో కంపెనీ ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచుతుంది. దీని ద్వారా ఆ పోస్ట్ తమకు ఎందుకు కనిపిస్తుందో యూజర్స్ అర్థం చేసుకోగలరు. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫాంల విషయంలో మాత్రం ఇన్‌స్టాగ్రామ్ ముందంజలో ఉంది.










Read Also: ట్విట్టర్ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ పొందిన మస్క్ ట్వీట్ - ఎంత రీచ్ వచ్చింది?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial