ప్రముఖ నటి సురేఖా వాణి (Surekha Vani) పేరు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. కేపీ చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, ఆ తర్వాత అందులో ఆమె పేరు రావడం, పలువురు ఆమెపై విమర్శలు చేయడం తెలిసిన విషయాలే. ఆ తర్వాత సోషల్ మీడియాకు ఆవిడ చిన్న బ్రేక్ ఇచ్చారు. సాధారణంగా సురేఖా వాణి, ఆమె కుమార్తె సుప్రీత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. 


కుమార్తెతో సురేఖా వాణి డ్యాన్స్
మే 26 తర్వాత సోషల్ మీడియాలో సురేఖా వాణి పోస్టులు చేయడం ఆపేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు వైరల్ అయ్యింది. సుమారు 45 రోజులకు ఆవిడ రెండు రీల్స్ పోస్ట్ చేశారు. 


అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'దేశముదురు' సినిమా గుర్తు ఉందా? అందులో అలీ డైలాగులు గుర్తు ఉన్నాయా? 'తీస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం, మహాభారతం ఏమీ పనికి రావు. షాక్స్, ఝలక్స్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ... ప్రతి సీను క్లైమాక్స్‌లా ఉంటుంది' అని అలీ ఓ డైలాగ్ చెబుతారు కదా! దానికి సురేఖా వాణి రీల్ చేశారు. డ్రగ్స్ కేసును ఉద్దేశించి ఆవిడ ఈ రీల్ చేశారేమోనని కొందరు డౌట్.


Also Read 'రంగబలి' దర్శకుడి జోకులకు భయపడిన సుమ - జనాలు అపార్థం చేసుకుంటే?






కుమార్తె సుప్రీతతో కలిసి సురేఖా వాణి మరో రీల్ చేశారు. అందులో తల్లీ కుమార్తెలు డ్యాన్స్ చేశారు. అయితే... ఆ రీల్ కింద కామెంట్ చేసే ఆప్షన్ అందరికీ ఇవ్వలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో సురేఖా వాణి, సుప్రీత ఎవరిని అయితే ఫాలో అవుతారో, వాళ్ళు మాత్రమే కామెంట్ చేయవచ్చు అన్నమాట.  


డ్రగ్స్ కేసు to నార్మల్ లైఫ్!
సురేఖా వాణి చేసిన రీల్స్ చూస్తే... ఆవిడ సాధారణ జీవితానికి వచ్చినట్లు అర్థం అవుతోంది. కృష్ణ ప్రసాద్ ఫోన్ నంబర్స్ లిస్టులో సురేఖా వాణి పేరు ఉండటంతో కేసులో ఆమె పేరు బలంగా వినపడింది. కుమార్తె సుప్రీత పుట్టినరోజు వేడుకల్లో సురేఖా వాణి చేసిన హంగామా చర్చనీయాంశం అయ్యింది. తొలుత మౌనంగా ఉన్నా... న్యూస్ ఛానళ్లలో ఎక్కువ రచ్చ కావడంతో ఆవిడ ఓ వీడియో విడుదల చేశారు.


Also Read పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్ - ఈసారి హీరో ఎవరంటే?



దయచేసి ఆరోపణలు ఆపేయండి... 
మాకు ఎటువంటి సంబంధం లేదు!
''కొంత కాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు, మాకు ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మా మీద ఆరోపణలు చేయడం ఆపేయండి! మీరు చేస్తున్న ఆరోపణల వల్ల వృత్తిపరమైన జీవితం, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, కుటుంబాలు, ఆరోగ్యం... అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి'' అని సురేఖా వాణి పేర్కొన్నారు.






సురేఖా వాణితో పాటు డ్రగ్స్ కేసులో 'బిగ్ బాస్' ఫేమ్ అషు రెడ్డి, నటి జ్యోతి పేర్లు కూడా వచ్చాయి. వాళ్ళిద్దరూ కూడా తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ న్యూస్ ఛానళ్ళలో రావడం వల్ల ప్రతి సెకన్ ఓ ఫోన్ కాల్ వస్తుందని, తన నంబర్ బయట పెట్టిన ఛానళ్లపై కేసు వేస్తానని అషు రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో కేవలం అమ్మాయిల ఫోటోలు మాత్రమే ఎందుకు వేస్తున్నారని, అబ్బాయిల ఫోటోలు ఎందుకు బయటకు రావడం లేదని జ్యోతి ప్రశ్నించారు.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial