బుల్లితెరపై సుమ కనకాల (Suma Kanakala)కు ఎదురు లేదు. ఆమె యాంకరింగ్ కోసం లేదంటే కేవలం ఆవిడ హోస్ట్ చేస్తున్నారని టీవీ షోలు చూసే జనాలు ఎంతో మంది ఉన్నారు. తెలుగు లోగిళ్ళలోని కుటుంబ ప్రేక్షకులలో సుమకు మంచి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని ఆవిడ భయపడ్డారు. అందుకు కారణం 'రంగబలి' దర్శకుడు పవన్ బాసంశెట్టి. 


'సుమ అడ్డా'లో రంగబలి టీమ్!
'రంగబలి' జూలై 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల సందర్భంగా ప్రచారం కోసం హీరో నాగశౌర్య, హీరోయిన్ యుక్తి తరేజ, నటుడు నోయెల్, చిత్ర దర్శకుడు పవన్ బాసంశెట్టి కలిసి 'సుమ అడ్డా' కార్యక్రమానికి వెళ్లారు. ఆ ఎపిసోడ్ జూలై 1న ఈటీవీలో టెలికాస్ట్ అయ్యింది. యూట్యూబ్‌లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. 


'రంగబలి' ఫస్టాఫ్ వరకు ప్రేక్షకులను ఎలా అయితే నవ్వించారో... 'సుమ అడ్డా'లో కూడా దర్శకుడు పవన్ బాసంశెట్టి ఆ విధంగా నవ్వించారు. ఆయన జోకుల్లో కొన్ని డబుల్ మీనింగ్స్ కూడా ఉన్నాయి. వాటికి సుమ నవ్వినా సరే... ''ఈ ఎపిసోడ్‌లో ఈయన (పవన్ బాసంశెట్టి) వేసిన జోకులకు దయచేసి నా రియాక్షన్స్ తీసేయండి. నన్ను జనాలు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది'' అని ఘొల్లుమన్నారు. ఆ మాటలను బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


వెంకటేష్ మహా వర్సెస్ 'కెజియఫ్'
సుమ డైలాగ్ తర్వాత నటుడు నోయెల్ సేన్ ''కొంతమంది రియాక్షన్స్ ఇవ్వడం వల్ల ట్రోల్ అయ్యారు'' అని అంటే... 'అవును' అని సుమ చెప్పారు. వాళ్ళిద్దరూ పేర్కొన్నది వెంకటేష్ మహా వర్సెస్ 'కెజియఫ్' ఇష్యూ అని నెటిజనులు ఫీల్ అవుతున్నారు. 'కెజియఫ్' మీద వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ షోలో ఉండి నవ్వినందుకు మిగతా దర్శకులు మోహనకృష్ణ ఇంద్రగంటి, నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయలను కూడా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. 


Also Read : ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎన్టీఆర్ - అంతా విదేశాల్లోనే?



'రంగబలి'కి మిశ్రమ స్పందన
విమర్శకుల నుంచి 'రంగబలి'కి మిశ్రమ స్పందన లభించింది. ఫస్టాఫ్ కామెడీ సూపర్ హిట్ అయితే... సెకండాఫ్ ఆశించిన రీతిలో లేదని రివ్యూ రైటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అయితే... ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది. అందులో నాగశౌర్య వ్యవహారశైలి వివాదాస్పదం అయ్యింది. 


Also Read 'సలార్' 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న సప్తగిరి - ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు


'రంగబలి'లో లాజిక్స్ గురించి విలేకరుల పదేపదే ప్రశ్నలు అడగటంతో దర్శకుడు పవన్ బాసంశెట్టి, హీరో నాగశౌర్య అసౌకర్యానికి గురయ్యారు. ''ప్రతిదీ డిటైల్డ్‌గా చూపించాలంటే... సుమారు 16 గంటలు పడుతుంది'' అని నాగశౌర్య ఆన్సర్ ఇచ్చారు. ఆ తర్వాత ఉన్నట్టుండి సక్సెస్‌ మీట్ నుంచి బయటకు వెళ్లారు. సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ బావుందని చెబుతున్నారంటే... ఇంటర్వెల్ తర్వాత సినిమా బాలేదని కాదని, ఇంటర్వెల్ ముందు ఎక్కువ నవ్వించడం తమ తప్పేనని నాగశౌర్య పేర్కొన్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మరి, ఎన్ని రోజులకు ఓటీటీలో వస్తుందో చూడాలి.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial