Triumph Speed ​​400: ఈ ఏడాది దేశంలో విడుదల అయిన బైక్‌ల్లో ట్రయంఫ్ స్పీడ్ 400 చాలా ప్రజాదరణ పొందింది. కేవలం నెల రోజుల్లోనే ఈ బైక్ 15,000కు పైగా బుకింగ్స్‌ను అందుకుంది. ముంబై, పుణే, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఈ మోటార్‌సైకిల్ డెలివరీని కంపెనీ ప్రారంభించింది. ట్రయంఫ్ స్పీడ్ 400 ధర రూ. 2.23 లక్షల నుంచి ప్రారంభం కానుంది.


మోటార్ సైకిల్ మొదటి 10,000 యూనిట్లను ప్రారంభ ధర వద్ద విక్రయించారు. ఇప్పుడు ఈ బైక్ రూ. 2.23 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంది. ఈ ధరతో స్పీడ్ 400 ఇటీవల విడుదల అయిన హార్లే డేవిడ్సన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650తో పోటీపడుతుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 వెయిటింగ్ పీరియడ్ గురించి మాట్లాడితే ఇది వివిధ నగరాల్లో 10 నుంచి 16 వారాల వరకు మారుతూ ఉంటుంది.


ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది బ్రిటిష్ తయారీదారు కంపెనీ భారతదేశంలో లాంచ్ చేసిన అత్యంత చవకైన బైక్. దీన్ని బజాజ్ ఆటో భాగస్వామ్యంతో రూపొందించారు. ఇది మహారాష్ట్రలోని బజాజ్ ఆటో చకన్ ప్లాంట్‌లో తయారు అవుతుంది. ఇది ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.


ట్రయంఫ్ స్పీడ్ 400 ఇంజిన్ ఎలా ఉంది?
ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌లో 398 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,000 ఆర్పీఎం వద్ద 40 బీహెచ్‌పీ, 6,500 ఆర్పీఎం వద్ద 37.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ కోసం 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. అలాగే ఇది ముందు వైపున 43 ఎంఎం యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌ను పొందుతుంది. స్పీడ్ 400లో రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లతో అమర్చారు. ఇది ఏబీఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం)ని కూడా పొందుతుంది.


కలర్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి?
ట్రయంఫ్ స్పీడ్ 400 మూడు పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. స్టార్మ్ గ్రేతో కాస్పియన్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్‌తో కార్నివాల్ రెడ్, స్టార్మ్ గ్రేతో ఫాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial