Tata Punch iCNG: టాటా మోటార్స్ ఈరోజు తన ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో కూడిన టాటా ఐసీఎన్‌జీ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. ఇంతకు ముందు కూడా టాటా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌ను కూడా ఇదే టెక్నాలజీతో పరిచయం చేసింది. కంపెనీ ఈ కారు ప్రారంభ ధరను రూ.7.10 లక్షలుగా (ఎక్స్ షోరూమ్) ఉంచింది. దీన్ని మూడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. అవే ప్యూర్, అడ్వెంచర్, అకాప్లిష్డ్.


టాటా ఈ కారును ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో పరిచయం చేసింది. వీటిలో ఒక్కో సిలిండర్ 30 లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రెండు సిలిండర్లు లగేజీ ప్రాంతం కింద ఉంచారు. అప్పుడు కూడా 210 లీటర్ల స్పేస్ ఇందులో అందుబాటులో ఉంది. దీనిలో అందించిన సీఎన్‌జీ సిలిండర్‌కు మరింత క్రాష్ సెక్యూరిటీని అందించడానికి దీని వెనుక బాడీ నిర్మాణం, ఆరు పాయింట్ల మౌంటు సిస్టమ్ పని చేస్తుంది.


టాటా పంచ్ ఐసీఎన్‌జీ సేఫ్టీ ఫీచర్లు
ఈ కారులో మైక్రో స్విచ్ అందించారు. సీఎన్‌జీని రీ ఫ్యూయల్ చేస్తున్నప్పుడు కారును మూసి ఉంచడానికి ఈ మైక్రో స్విచ్ ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఇది థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్‌ను కూడా పొందింది. దీని కారణంగా సిలిండర్ నుంచి గ్యాస్ బయటకి వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది.


టాటా పంచ్ ఐసీఎన్‌జీ ఇంజిన్
ఈ టాటా ఎస్‌యూవీ 1.2 లీటర్ 3 సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది గరిష్టంగా 86 హెచ్‌పీ శక్తిని, 113 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీలో ఈ కారు 6,000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 72 హెచ్‌పీ శక్తిని, 3,230 ఆర్పీఎం వద్ద 103 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దాని సీఎన్‌జీ వేరియంట్‌లో 6 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ మాత్రమే అందించారు.


టాటా పంచ్ ఐసీఎన్‌జీ డిజైన్
ఇది వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సీట్ ఆర్మ్‌రెస్ట్, యూఎస్‌బీ టైప్ సీ ఛార్జర్, షార్క్ ఫిన్ యాంటెన్నాను కలిగి ఉంది. ఇది కాకుండా ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన హర్మాన్ ఏడు అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కూడా ఉన్నాయి.


ఈ నాలుగు కార్లలో ట్విన్ సిలిండర్లు
ఈ సంవత్సరం మేలో టాటా ఆల్ట్రోజ్ ద్వారా మొదటిసారి తన కారులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని విడుదల చేసింది. కానీ ఇప్పుడు దాని టాటా పంచ్ ఐసీఎన్‌జీ లాంచ్‌తో, కంపెనీ ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో టాటా పంచ్, టాటా టిగోర్ (ప్రారంభ ధర రూ. 7.8 లక్షలు ఎక్స్ షోరూమ్), టాటా టియాగో (ప్రారంభ ధర రూ. 6.55 లక్షలు ఎక్స్ షోరూమ్) కూడా పరిచయం చేసింది. అదే సమయంలో టాటా టియాగో, టిగోర్ తమ సెగ్మెంట్‌లోని మొదటి వాహనాలు, ఇవి పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి.


వీటితోనే పోటీ
టాటా పంచ్ ఐసీఎన్‌జీతో పోటీపడే వాహనాల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్, మారుతి ఫ్రాంక్స్, రెనో కిగర్, మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ కార్లు ఉన్నాయి.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial