సీబీఎస్‌ఈ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆగస్టు 4న విడుదల చేసింది. సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రూల్ నెంబరు, స్కూల్ నెంబరు, పుట్టినతేదీ, అడ్మిట్‌కార్డు ఐడీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది జులై 17 నుంచి 22 వరకు నిర్వహించిన సీబీఎస్ఈ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,27,622 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో కేవలం 60,551 (47.40 %) మంది విద్యార్థులు మాత్రమే అర్హత సాధించారు. 


సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆగస్టు 1న సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 47.50% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 1,207,42 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 57,331 మంది మాత్రమే అర్హత సాధించారు. 


సీబీఎస్‌ఈ పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చూసుకోండి..


➥ సీబీఎస్‌ఈ క్లాస్-10 సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి - cbse.gov.in.


➥ అక్కడ హోంపేజీలో "Results" సెక్షన్‌లోకి వెళ్లాలి. 


➥ సీబీఎస్‌ఈ క్లాస్-10 సప్లిమెంటరీ ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి. 


➥ లాగిన్ పేజీలో విద్యార్థులు తమ రూల్ నెంబరు, స్కూల్ నెంబరు, పుట్టినతేదీ, అడ్మిట్‌కార్డు ఐడీ వివరాలు నమోదుచేయాలి. 


➥ వివరాలు నమోదుచేసి "Submit" బటన్‌పై క్లిక్ చేయాలి.


➥ సీబీఎస్‌ఈ పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 


➥ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవచ్చు.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించారు. ఆగస్టు 16 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు గడువు జులై 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రవేశ దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు ఆగస్టు 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నవోదయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ - పరీక్ష విధానం, ఎంపిక, అర్హతల వివరాలు ఇలా!
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఏడాది రెండు విడతల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ ఏడాది నవంబరు 4న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఇంటర్‌ దాకా ఉచితంగా చదువు, వసతి, భోజనం కల్పిస్తారు. బోధన కూడా అత్యున్నత ప్రమాణాల్లో ఉంటుంది. ప్రవేశ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 19న ప్రారంభంకాగా, ఆగస్టు 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 


Education Loan Information:
Calculate Education Loan EMI