TDP Candidate from Puthalapattu:
పూతలపట్టు : ప్రాజెక్టుల పరిశీలన కొనసాగిస్తున్న చంద్రబాబు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు రోడ్డు షోలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిని ప్రకటించారు. జర్నలిస్టు మురళీమోహన్ ఒక‌ మంచి అభ్యర్ధి అని, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన వ్యక్తి అని వచ్చే ఎన్నికల్లో పూతలపట్టు నుంచి ఆయనను గెలిపించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మురళిమోహన్ ను ఆదరించాలని, ఐదు వేల రూపాయలకు మోసపోవద్దు అని సూచించారు. 


పూతలపట్టుకు వస్తే ఘన స్వాగతమా, అఖండ స్వాగతమా అని నాకు అర్ధం కావడం‌లేదు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు విధ్వసంపై యుద్ధం భేరికి వచ్చాను. ఎక్కడ నాకు అడ్డు రాలేదు కానీ.. నేను పుట్టిన ఈ జిల్లాలో ఒక అహంభావి, ఉన్మాది నాకు అడ్డు వచ్చారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. సుదీర్ఘ రాజకీయంలో ఎంతో మందిని చూశానని, డబ్బు ఉందని ప్రజలను దోచుకుంటే ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. నీకు అధికారం ఇచ్చింది ప్రజలను దోచుకోవడం కోసం‌ కాదు.. మీకు ఇదే ఆఖరి అవకాశం. పులివెందులలో వైనాట్ పులివెందుల అని జనాలు అన్నారు. మీ కళ్ళ ముందు‌పుట్టా.. మీ ముందు రాజకీయం చేసాం. నందికొట్టూరులో ప్రాజెక్టులపై యుద్దం‌ ప్రకటించా అన్నారు చంద్రబాబు


‘శ్రీశైలం నుండి చిత్తూరు జిల్లా కుప్పం వరకూ నీళ్లు ఇవ్వాలని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. పుంగనూరు అడవి చెరువులకు నీళ్లు ఇచ్చాను. హంద్రీనీవా ప్రాజెక్ట్ పడకేసింది. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తా. నీవానది నుండి‌ పూతలపట్టు నియోజకవర్గంలోని‌ ఐదు‌ మండకలాకు నీళ్లు ఇస్తా. పెద్దిరెడ్డి తమ్ముడు నన్ను అడ్డుకున్నారు. సిగ్గు లేకుండా చిత్తూరు బంద్ కు వైసీపీ నేతలు పిలుపు నిచ్చారు. నాపై దాడి చేసి మళ్ళీ వాళ్ళే దొంగే దొంగ అన్నట్లు బంద్ ఇచ్చారు’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.


గ్రేట్ ఎస్పీ ఇక్కడ ఉన్నారని, ఇలాంటి ఎస్పీలను కొన్ని వేల మందిని చూశానన్నారు. మంత్రి పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తారా. పార్టి నాయకుడు వచ్చినప్పుడు వాళ్ళు రోడ్డుపైకి రాకూడదని, నాపై దాడి చేసి, చంపాలని అనుకుంటున్నావా ఎస్పీ అని ప్రశ్నించారు. తనకు 20 ఏళ్ల కిందట ఎన్ఎస్‌జీని ఇచ్చారని, పోలీసులను టిడిపి వాళ్ళు కొట్టారని ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. కాసుకో ఈ సారి పుంగనూరు నువ్వు గెలువో చూస్తా- అంటూ మంత్రి పెద్దిరెడ్డికి చాలెంజ్ చేశారు. 


1984లో ఎన్టీఆర్ ప్రజాస్వామ్యంకు కాపాడిన పార్టి టిడిపి. హంద్రీనీవా పనులు చేయని పెద్దిరెడ్డికి మంత్రి పదవి అవసరమా. ఇసుక, మద్యం, రోడ్లు, అన్ని పనులు నీకే కావాలా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రౌడీయిజాం చేస్తే నేను ఊడిగం చేయాలా అన్నారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ రేట్లు కూడా పెంచిన ఘనత సీఎం జగన్ సొంతమన్నారు. ఆ మద్యం డబ్బుకు అంతా తాడేపల్లి కొంపకు వెళ్తుందన్నారు. 


హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపించా..
కరెంటు ఛార్జీలు,‌ పెట్రోల్,‌ డీజిల్, ఇంటి పన్ను, పెంచారు. కానీ రైతులకు ఇబ్బంది లేకుండా కరెంటు ఇచ్చిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం. సెల్ ఫోన్ రావడానికి, టెక్నాలజీ అభివృద్ధి చేయడానికి టిడిపి కృషి చేసిందన్నారు. కోకాపేటలో‌ ఎకరా భూమి వంద కోట్లు అయింది. హైదరాబాద్ అభివృద్ధి చేసి చూపించా. తమిళనాడు, కర్ణాటక వాళ్ళు రాజధాని ఏది అని అడిగితే సిగ్గుతో తలదించుకునే పరిస్ధితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. హైదారాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచం పటంలో పెట్టించా. 2029కి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలను కలలు కన్నానని చెప్పారు. అమరావతి రాజధాని కోసం రైతులు నమ్మకంతో భూములు ఇచ్చారంటే అది టిడిపిపై నమ్మకం అని, కానీ ఓ దుర్మార్గుడు వచ్చి అమరావతిని నాశనం చేశాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.