Bullet 350 Rivals In India: రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పిచ్చి క్రేజ్ ఉంది. ముఖ్యంగా, కాలేజీ విద్యార్థులు & యువ ఉద్యోగులు ఈ బండ్లను బాగా ఇష్టపడతారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌ సైకిళ్లలో బుల్లెట్ 350కి అత్యంత ఎక్కువ మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. యూత్‌కు ఇదంటే మహా వ్యామోహం.

Continues below advertisement


సైన్యం కోసం తీసుకొచ్చిన మోటార్‌ సైకిల్‌ ఇది
బుల్లెట్ 350 బైక్‌ను 1949లో భారత సైన్యం కోసం డిజైన్‌ చేశారు. సరిహద్దుల్లో గస్తీ తిరగడానికి భారత ప్రభుత్వం ఈ బైక్‌లను డిజైన్‌ చేసింది. అయితే, ఈ బండి రాయల్‌ లుక్‌ సాధారణ ప్రజలను కూడా బాగా ఆకర్షించింది, ఈ బైక్‌పై ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం, ఈ బైక్‌కు భారత మార్కెట్లో కొన్ని ప్రత్యర్థి టూవీలర్‌లు కూడా ఉన్నాయి. 


బుల్లెట్ 350 (Bullet 350 Engine Engine & Performance)
బుల్లెట్ 350 సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది. ఈ ఇంజిన్ 6,100 rpm వద్ద 20.2 bhp పవర్‌ను & 4,000 rpm వద్ద 27 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌ను 5-స్పీడ్ కాన్‌స్టంట్ మెష్ గేర్‌బాక్స్‌తో నడపవచ్చు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటర్‌ సైకిల్‌ లీటర్‌ పెట్రోలుకు 35 కిలోమీటర్ల మైలేజీని (Bullet 350 Mileage) ఇస్తుంది. ఈ బండి ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు. ఈ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, ఈ మోటార్‌సైకిల్ దాదాపు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. బుల్లెట్ 350 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.24 లక్షల నుంచి (Bullet 350 ex-showroom price) ప్రారంభం అవుతుంది.


క్లాసిక్ 350 ‍‌(Classic 350 Engine & Performance)
బుల్లెట్‌కు గట్టి పోటీ ఇచ్చే మరొక బైక్‌ క్లాసిక్ 350. ఇది కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ బండే. క్లాసిక్ 350 కూడా బుల్లెట్‌ తరహాలోనే 350cc ఇంజిన్‌ మోటార్ సైకిల్. ఈ బైక్‌ కూడా బుల్లెట్ 350 మాదిరిగానే ఇంజిన్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. ఈ రెండు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బంట్లు ఒకేలాంటి మైలేజీని ఇస్తాయి. అయితే, ఈ రెండు బైక్‌ల స్టైల్‌ & డిజైన్‌లో తేడాలు ఉంటాయి. క్లాసిక్ 350 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.52 లక్షల నుంచి (Classic 350 ex-showroom price) ప్రారంభం అవుతుంది.



జావా 42 (Jawa 42 Engine & Performance)
జావా 42 కూడా బుల్లెట్ 350కి గట్టి పోటీ ఇచ్చే బైక్. జావా 42 లో సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 27.32 ps పవర్ & 26.84 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ ఇంజిన్‌ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ బైక్ లీటరు పెట్రోలుకు 34 kmpl మైలేజీని  (Jawa 42 Mileage) ఇస్తుంది. ఈ మోటార్ సైకిల్‌కు 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్‌ ఉంది. ఈ ట్యాంక్‌ను ఫుల్‌ చేస్తే ఈ బైక్ 425 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. జావా 42 ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.24 లక్షల నుంచి (Jawa 42 ex-showroom price) ప్రారంభం అవుతుంది.