కురబలకోట: అన్నమయ్య జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో 11 మందికి గాయాలయ్యాయి. కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా విషాదం చోటుచేసుకుంది.చనిపోయినవారిని కర్ణాటకకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. టెంపుల్లో ప్రయాణిస్తున్న 14 మందిలో ఘటనా స్థలంలోనే చరణ్,మేఘర్ష్, శ్రావణి   మృతి చెందారు. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.