Chinni Serial Today Episode చిన్నిని మధుమితగా మధ్య తరగతి కుటుంబం మార్చేస్తుంది. మధుమిత పెద్దది అవుతుంది. తన స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతుంది. మధుమిత సీలు రాకాసి చీరేస్తుంది. అంటూ కూతకు వెళ్తుంది. మధుమిత తన టీమ్‌ని గెలిపిస్తుంది. మధుమితకు తమ్ముడు కూడా ఉంటాడు. అక్కా అక్కా అంటూ మా అక్క మీద గెలిచే వాడు ఈ జిల్లాలోనే ఎవడూ లేడు అంటాడు.
మధుమిత చేతిలో ఓడిపోయిన అమ్మాయిలు మధుమిత పొగరు అనిణి దీన్ని భరించే వాడు ఎక్కడున్నాడో అనుకుంటారు. ఫారెన్ నుంచి మహి ఎంట్రీ ఇస్తాడు. రావడం రావడమే చిన్నిని తలచుకొని నువ్వు లేకుండా ఎన్ని ఏళ్లు ఫారెన్‌లో ఎలా గడిచిపోయిందో నీ కోసమే వచ్చాను చిన్ని అనుకుంటాడు. కళ్లు మూసుకొని చిన్నిని తలచుకుంటాడు. ఇక నుంచి నిన్ను వెతకడమే నా పని అని అనుకుంటాడు. మహి వెళ్తుండగా దారిలో ఓ అమ్మ బట్టలు చినిగిపోయి వణుకుతూ ఉంటే తన జాకెట్ ఇస్తాడు.
చిన్ని తమ్ముడిని తీసుకొని ఇంటికి వస్తాడు. తల్లి అద్దం ముందు రెడీ అవుతుంది. చిన్ని, తమ్ముడు ఇద్దరూ తల్లి సూపర్ అని అందాల పోటీకి వెళ్తే ఫస్ట్ వస్తుందని వెటకారం చేస్తారు. తల్లిని హగ్ చేసుకొని సంతోషంగా ఉంటారు. ఇక తండ్రి రావడంతో మధు చక్కగా మాట్లాడుతుంది. తండ్రికి జ్వరంగా రావడంతో తానే కూరగాయలు అమ్ముతానని బండి మీద పెట్టుకొని బయల్దేరుతుంది. మధు కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. దారిలో ఓ బామ్మ ఆపి చదువుకున్న దానివి నువ్వు ఎందుకే కూరగాయలు అమ్ముతున్నావ్ అంటే మా నాన్నకి బాలేదు అత్త అందుకే నేను వచ్చాను. అని అంటుంది. మధుమిత తర్వాత మరొకామెతో వెటకారం చేస్తూ మాట్లాడుతుంది. ఆవిడ మధుతో నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ వాడు అయిపోతాడు అంటుంది. ఇంకో ఆవిడ వచ్చి నా కొడుకు డిగ్రీ చేశాడు పెళ్లి చేసుకుంటావా అంటే నేను బీటెక్ చేశా కదా అత్త అంటుంది. అయితే ఎంటెక్ చేసేవాడిని చేసుకుంటావా అంటే టెక్కులు లేనివాడిని చేసుకుంటా అంటుంది.
మధుమిత కూరగాయలు అమ్ముతూ తిరుగుతూ ఉంటే మహి చిన్ని గురించి ఆలోచిస్తూ వచ్చి మధుమితని గుద్దేస్తాడు. మధుమితని పైకి లేపడానికి చేయి అందిస్తే మధు తిడుతుంది. మహి బండి లేపుతాడు. నేను తొందరగా వెళ్లాలి అని మహి అంటే కూరగాయలు ఎత్తమని అంటుంది. నేను ఎవరో తెలుసా మ్యాడీ అని అంటాడు. మధుమిత, మ్యాడీ గిల్లిగజ్జాలు మొదలవుతాయి. మ్యాడీ మధు తన దగ్గరకు వస్తుంటే మూడు అడుగులు వెనక్కి వేస్తాడు. మధు కూరగాయలు ఎత్తమని అంటే ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇస్తా అంటాడు. పర్స్‌లో డబ్బులు ఒకావిడకు ఇవ్వడంతో అతని దగ్గర డబ్బులు ఉండవు. దాంతో కార్డు ఇస్తాడు.
మధుమిత కూరగాయలు బండి నీ వల్ల పోయిందని కూరగాయలు అమ్మితేనే తమకు డబ్బులు వస్తాయని చెప్తుంది. మహి కారు మీద కూరగాయలు పెట్టి అమ్ముతానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.