Tata Electric Platform: టాటా మోటార్స్ తన తాజా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను పంచ్ ఈవీ ద్వారా పరిచయం చేసింది. ఇది రాబోయే వారాల్లో అమ్మకానికి అందుబాటులో ఉండనుంది. టాటా ఆక్టీ.ఈవీ (Tata Acti.EV) అని పిలిచే ఈ కొత్త ఆర్కిటెక్చర్ దీర్ఘకాలిక సామర్థ్యం కోసం ప్రిస్మాటిక్ సెల్‌లు, మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కెపాసిటీతో కూడిన సిలిండ్రికల్ సెల్స్‌తో సహా మరిన్ని ఎక్కువ బ్యాటరీ ప్యాక్‌లకు మద్దతు ఇస్తుంది.


క్రాష్ టెస్ట్‌లలో టాప్ రేటింగ్స్
ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD), రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్‌లకు సపోర్టింగ్, ఆక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్ 400 వోల్ట్‌లతో నడుస్తుంది. పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌లు, ఇండక్షన్ మోటార్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇది 80 బీహెచ్‌పీ నుంచి 230 బీహెచ్‌పీ వరకు పవర్‌ని జనరేట్ చేయగలదు. ఇది అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూలంగా ఉంటుంది.


ఆక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్ వెహికల్ టు లోడ్ (వీ2ఎల్), వెహికల్ టు వెహికల్ (వీ2వీ) సామర్థ్యాలను కలిగి ఉంది. టాటా క్రాష్ టెస్టింగ్‌లో టాప్ సేఫ్టీ రేటింగ్‌లను సాధించడానికి ప్లాట్‌ఫారమ్ ఇంపార్టెన్స్‌ను నొక్కి చెప్పింది. ముఖ్యంగా పోల్, సైడ్ ఇంపాక్ట్‌ల సందర్భాల్లో బ్యాటరీని రక్షించడానికి రూపొందించిన కోర్ ఆర్కిటెక్చర్‌తో అల్ట్రా హై స్ట్రెంగ్త్ స్టీల్‌తో తయారు చేశారు.


ఫీచర్లు ఇలా...
ఆక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలు ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం 5జీ ఎనేబుల్డ్ సిస్టమ్‌తో వస్తాయి. ఈ మోడళ్లలో థర్డ్ పార్టీ యాప్‌లు, సర్వీసులకు అందుబాటులో ఉండే డిజిటల్ స్క్రీన్‌లు ఉంటాయి. రాబోయే కొన్ని ఆక్టీ.ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారిత కార్లు లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) టెక్నాలజీని కలిగి ఉంటాయి.


ఇతర మోడల్స్ కూడా
పంచ్ ఈవీ తర్వాత టాటా కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ తదుపరి ఆక్టీ.ఈవీ ఆధారిత మోడల్‌లుగా వస్తాయని భావిస్తున్నారు. కొత్త టాటా సియెర్రా ఈవీ కూడా అదే ప్లాట్‌ఫాంపై తయారు కానుంది. టాటా అవిన్య కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు బ్రాండ్ జెన్3 స్కేలబుల్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. ఇది హ్యాచ్‌బ్యాక్, సెడాన్, ఎంపీవీ, ఎస్‌యూవీలతో సహా ఎక్కువ బాడీ స్టైల్స్‌ను సపోర్ట్ చేస్తుంది.


మరోవైపు కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కారు ఈ నెల 16వ తేదీన లాంచ్ కానుంది. అయితే దాని వేరియంట్లు, గేర్‌బాక్స్ ఆప్షన్ల గురించి కొన్ని ఇంట్రస్టింగ్ వివరాలు బయటకు వచ్చాయి. కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ టాప్ ఎండ్ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో  మార్కెట్లోకి రానుంది. పాడిల్ షిఫ్టర్లు, డీసీటీ ఆటోమేటిక్‌తో SX(O), SX(O) DT వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!