Tata Motors: టాటా మోటార్స్ నెక్సాన్, హారియర్ నుంచి సఫారీ వరకు డిజైన్, ఫీచర్ల పరంగా దాని మొత్తం లైనప్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తుంది. అదనంగా కంపెనీ రాబోయే రెండు, మూడు సంవత్సరాలలో కొత్త ఐసీఈ ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాల లైనప్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.


2023 అక్టోబర్‌లో టాటా మోటార్స్ 45,220 యూనిట్లను విక్రయించింది. మారుతి సుజుకి, హ్యుందాయ్‌ల కంటే వెనుకబడి మొత్తం అమ్మకాల పరంగా మూడవ స్థానంలో నిలిచింది. నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన టాటా మోడల్‌గా తన రన్‌ను కొనసాగించగా, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్ వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. గత నెలలో టాటా మోటార్స్ 2,762 యూనిట్ల హారియర్, 1,751 యూనిట్ల సఫారీ ఎస్‌యూవీలను విక్రయించింది. ఇవి రెండూ త్వరలో అప్‌డేట్ కానున్నాయి. ఏ టాటా కారుపై ఎంత వెయిటింగ్ పీరియడ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


హారియర్, సఫారీ, టియాగోలపై వెయిటింగ్ పీరియడ్ ఇలా...
టాటా హారియర్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లపై నాలుగు నుంచి ఆరు వారాల వరకు, టాటా సఫారీ ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లపై నాలుగు నుంచి ఆరు వారాల వరకు, టియాగో పెట్రోల్‌పై నాలుగు వారాల వరకు, టియాగో సీఎన్‌జీపై ఎనిమిది వారాల వరకు, టాటా ఆల్ట్రోజ్ డీజిల్‌పై ఆరు వారాల వరకు , టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీపై ఆరు వారాల వరకు, టాటా పంచ్ పెట్రోల్‌పై నాలుగు వారాల వరకు, టాటా పంచ్ సీఎన్‌జీపై 12 వారాల వరకు, కొత్త టాటా నెక్సాన్‌పై ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది.


టియాగోకు మంచి డిమాండ్
టాటా ప్రసిద్ధ టియాగో హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం ముంబై ప్రాంతంలో నాలుగు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉంది. అయితే దాని సీఎన్‌జీ వేరియంట్ కోసం వినియోగదారులు ఎనిమిది వారాల పాటు వేచి ఉండవలసి ఉంటుంది. హ్యాచ్‌బ్యాక్ XE, XM, XT (O), XT, XZ+, XT NRG, XZ NRGతో సహా వివిధ ట్రిమ్‌లలో కొనుగోలు చేయవచ్చు. వీటన్నింటికీ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది.


టాటా ఆల్ట్రోజ్ డీజిల్ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ తేదీ నుంచి ఆరు వారాల వరకు ఉంది. అయితే దాని సీఎన్‌జీ వేరియంట్ కోసం వెయిటింగ్ పీరియడ్ మాత్రం నాలుగు వారాలకు తగ్గింది. టాటా నుంచి అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటిగా ఉన్న పంచ్‌కు సంబంధించి పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్ల కోసం వరుసగా నాలుగు, 12 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. టాటా నెక్సాన్‌ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఆరు నుంచి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. లొకేషన్, కలర్, వేరియంట్ ఆధారంగా అన్ని కార్ల వెయిటింగ్ పీరియడ్‌లో తేడా ఉండవచ్చు.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial