వితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీలో నటి రేణు దేశాయ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో రేణు దేశాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అంతేకాదు.. ఆమె స్పీచ్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. 


రేణు దేశాయ్ మాట్లాడుతూ... ‘‘బద్రి - మూవీ విడుదలై సుమారు 20 ఏళ్లు అవుతోంది. కానీ, నిన్న.. మొన్న రిలీజైన ఫీలింగ్ మీరు కలిగిస్తున్నారు. మీ అభిమానాన్ని వర్ణించడానికి నాకు పదాలు రావడం లేదు. ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేయకున్నా సరే.. ఎప్పుడైనా కనిపిస్తే పలకరిస్తారు. సోషల్ మీడియాలో నన్ను ఫాలో చేస్తారు. సోషల్ మీడియాలో, ట్రైలర్ రిలీజ్ వేడుకలో.. ఇలా చాలాసార్లు డైరెక్టర్ వంశీకి థాంక్యూ చెప్పాను. కానీ, ఈ సారి నేను తప్పకుండా రవితేజాకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే.. 2019 నుంచి నేను ఈ సినిమాలో భాగంగా ఉన్నాను. కోవిడ్, టెక్నికల్ కారణాల వల్ల ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. ఒక రోజు వంశీ నాకు కాల్ చేసి.. రేణు గారు, సినిమా స్టార్ట్ అవుతుంది.. హీరో రవితేజా ఉన్నారని చెప్పారు. వెంటనే నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న.. వంశీ, నేను సినిమాలో ఉన్నానా? నన్ను సినిమా నుంచి తీసేయలేదు కదా అని. రవితేజ వంటి పెద్ద హీరోకు.. నా ప్లేస్‌లో వేరొక సీనియర్ నటికి అవకాశం ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. కానీ, నన్ను ఈ సినిమాలో ఉంచారు’’ అని తెలిపారు.


మీరు తీసుకున్న నిర్ణయం.. నాకెంతో ముఖ్యమైనది - రవితేజాకు రేణు ధన్యవాదాలు


రవితేజను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు పర్శనల్‌గా, పబ్లిక్‌గా అభినందనలు తెలుపుకుంటున్నాను. మీకు తెలియదు.. మీరు తీసుకున్న నిర్ణయం.. నాకు ఎంత ముఖ్యమైనదని.. ఇందుకు అభినందనలు. మీరు తప్పకుండా ఈ సినిమా థియేటర్‌లో చూడాలని నా వ్యక్తిగతం రిక్వెస్ట్ చేస్తున్నా’’ అంటూ రేణు దేశాయ్ స్పీచ్‌ను ముగించారు. అనంతరం యాంకర్ సుమా.. ‘‘భవిష్యత్తులో మీరు ఇక సోషల్ రెస్పాన్స్ పాత్రలే చేస్తారని బయట టాక్.. దీనిపై మీరు ఏమంటారు’’ అని ప్రశ్నించింది. ఇందుకు రేణు సమాధానమిస్తూ.. ‘‘అది రూమర్’’ అని తెలిపారు. 


తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో రిలీజ్ అవుతున్న ఈ మూవీకి మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇంకా అనుపమ్ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది. 'భగవంత్ కేసరి' 'లియో' చిత్రాలకు పోటీగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.


Also Read: చేతికి సెలైన్‌తో హాస్పిటల్ బెడ్ మీద సమంత - ఇన్‌స్టాగ్రామ్ ఫోటో వైరల్!