Tata Curvv vs Nexon vs Harrier Price Comparison: టాటా మోటార్స్ గత సంవత్సరం తన మోస్ట్ అవైటెడ్ కారు కర్వ్‌ను విడుదల చేసింది. కంపెనీ మొదట దీనికి సంబంధించిన ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తరువాత దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టాటా కర్వ్ రూ. 10 లక్షల ధరతో లాంచ్ అయింది. మార్కెట్లో అందుబాటులో ఉన్న టాటా ఇతర కార్లు నెక్సాన్, హారియర్ ధరలతో దాని ధరలను పోల్చినట్లయితే టాటా కర్వ్ మీకు సరైన ఆప్షన్ అవుతుందో లేదో చూద్దాం.

ఎలక్ట్రిక్‌తో పాటు టాటా కర్వ్ భారతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ కర్వ్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధరను రూ. 9,99,990 వద్ద ఉంచింది. దీంతో పాటు టాటా కర్వ్ టాప్ ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 14.69 లక్షల వరకు ఉంటుంది.

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

టాటా నెక్సాన్ వర్సెస్ కర్వ్టాటా నెక్సాన్ టర్బో పెట్రోల్ ప్రారంభ ధర రూ. 8 లక్షలు కాగా, దాని టాప్ ఎండ్ పెట్రోల్ డీసీఏ వేరియంట్ రూ. 15 లక్షల వరకు ఉంటుందని వెల్లడి అయింది. టాటా కర్వ్ డీసీఏ రెవోట్రాన్ ప్రారంభ ధర రూ. 12.4 లక్షలు కాగా డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 14 లక్షలుగానూ, ఎంట్రీ లెవల్ డీసీఏ ఆటోమేటిక్ ధర రూ. 16.49 లక్షలుగా ఉంది.

టాటా కర్వ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 11,49,990 నుంచి ప్రారంభం అవుతుంది. దీంతో పాటు దాని టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 17.69 లక్షలుగా ఉంది. టాటా కర్వ్ డీసీఏ డీజిల్ వేరియంట్ రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ రూ. 10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 15.8 లక్షలుగా ఉంది.

టాటా హారియర్ వర్సెస్ కర్వ్కర్వ్‌ను టాటా హారియర్‌తో పోల్చినట్లయితే... టాటా హారియర్ డీజిల్‌లో మాత్రమే వస్తుంది. దాని ధర రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది కాకుండా హారియర్ డీజిల్ కారు టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ. 26.44 లక్షల వరకు పెరుగుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే టాటా కర్వ్‌లో నెక్సాన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. కర్వ్ ప్రీమియం కూపే డిజైన్‌తో వస్తుంది.

టాటా మోటార్స్ కర్వ్‌లో 500 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ కారు 208 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. ఈ కారులో ఎల్ఈడీ లైట్లు అందించారు. భద్రత కోసం టాటా కర్వ్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి. టాటా కర్వ్ హైపెరియన్ జీడీఐ వేరియంట్‌లో వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?