సుజుకి కొత్త జనరేషన్ ఆల్టోను జపాన్‌లో ప్రదర్శించింది. ఇది తొమ్మిదో జనరేషన్ మోడల్. త్వరలో దీనికి సంబంధించిన సేల్ కూడా అక్కడ జరగనుంది. జపాన్‌లో అందుబాటులో ఉన్న ఆల్టో కారు, మనదేశంలో అందుబాటులో ఉన్న ఆల్టో కారు రెండు వేర్వేరుగా ఉంటాయి. అయితే మారుతి సుజుకి కూడా కొత్త ఆల్టో కారును రూపొందిస్తుంది. ఈ మోడల్ మనదేశంలో వచ్చే సంవత్సరం లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
జపాన్‌లో లాంచ్ అయిన సుజుకి ఆల్టో గురించి చూస్తే.. దీని డిజైన్ పూర్తిగా కొత్తగా ఉంది. మొత్తంగా చూసుకుంటే కొంచెం బాక్స్ తరహా డిజైన్ ఉన్నప్పటికీ.. ముందు వెర్షన్ కంటే చాలా కొత్తగా ఉంది. ఇందులో కొత్త తరహా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ అందించారు. కొత్త గ్రిల్, క్రోమ్ ఇన్‌సర్ట్ కూడా ఇందులో ఉన్నాయి.
ఈ కారు వెనకభాగాన్ని కూడా పూర్తిగా రీడిజైన్ చేశారు. కొత్త వర్టికల్ లైట్లు- కూడా ఇందులో అందించారు. ఇది ఎనిమిదో తరం ఆల్టో కంటే చాలా కొత్తగా ఉంది. అందులో కూడా కొత్త తరహా డిజైన్‌నే అందించారు. ఇందులో స్పీడోమీటర్ కోసం అనలాగ్ డయల్, మిగతా రీడ్ అవుట్ల కోసం డిజిటల్ డిస్‌ప్లేను కూడా అందించారు.
ఇంకో భారీ మార్పు ఏంటంటే.. కొత్త ఆల్టోలో ముందు వెర్షన్ కంటే మంచి ఇంటీరియర్‌ను అందించారు. దీంతో ముందు వెర్షన్ క్యాబిన్ కంటే దీని క్యాబిన్ ప్రీమియం లుక్‌తో ఉంది. మధ్యలో పెద్ద టచ్ స్క్రీన్ అందించారు. వర్టికల్ ఏసీ వెంట్లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంది.
ఇప్పుడు సుజుకీ కొత్త జనరేషన్ ఆల్టో కార్ డిజైన్ వివరాలను రివీల్ చేసింది. కానీ ఇంజిన్ గురించిన వివరాలు వెల్లడించలేదు. అయితే ఎనిమిదో తరం ఆల్టోలో అందించిన 658 సీసీ పెట్రోల్ ఇంజిన్‌నే ఇందులో కూడా అందించే అవకాశం ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ బ్యాటరీ ఉన్న ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్‌జీ) ఉండే అవకాశం ఉంది. టార్క్ అసిస్ట్, ఫ్యూయల్ వినియోగాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడనుంది.
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
Also Read: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!