Suzuki Access 125 Scooter: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన యాక్సెస్ 125 స్కూటర్‌లో 50 లక్షల యూనిట్‌ను హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఖేర్కి ధౌలా ప్లాంట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ స్కూటర్‌ను 2007లో మొదటగా లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పుడు ఇది 125 సీసీ సెగ్మెంట్‌లో మొదటి స్కూటర్. 16 ఏళ్లలో ఈ స్కూటర్ 50 లక్షల యూనిట్ల మైలురాయిని సాధించింది.


ఈ మైలురాయిని సాధించిన తర్వాత సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎండీ కెనిచి ఉమెడ మాట్లాడారు. ‘సుజుకి మోటార్‌సైకిల్ ఇండియాలో మనందరికీ ఇది ఒక పెద్ద మైలురాయి. ఇది యాక్సెస్ 125 పట్ల మా నిబద్ధతను, దేశీయ, విదేశీ మార్కెట్‌లలో వినియోగదారులు తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.’ అన్నారు. ప్రస్తుతం యాక్సెస్ 125ను భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని డెవలప్ చేశారు. అనేక అద్భుతమైన ఫీచర్లతో దీన్ని లోడ్ చేశారు.


సుజుకి యాక్సెస్ స్కూటీలో 125లో 8.7 హెచ్‌పీ పవర్, 10 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే, 124 సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ఎడిషన్లు అందుబాటులో ఉన్నాయి.


ఢిల్లీలో ఈ స్కూటీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 79,400 నుంచి ప్రారంభం అవుతుంది. టాప్ మోడల్‌ కొనుగోలు చేయాలంటే రూ. 89,500 వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం దేశంలోని 125 సీసీ సెగ్మెంట్‌లో యాక్సెస్ 125 కాకుండా, హోండా యాక్టివా 125, టీవీఎస్ జూపిటర్ 125, యమహా ఫాసినో 125 కూడా ఉన్నాయి.


వేటితో పోటీ పడుతుంది?
ఈ స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్, హోండా యాక్టివా 125తో పోటీపడుతుంది. టీవీఎస్ జూపిటర్ 125లో 124.8 సీసీ బీఎస్6 ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది 8.04 బీహెచ్‌పీ పవర్‌ని, 10.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


ముందు, వెనుక వైపు రెండు డ్రమ్ బ్రేక్‌లతో టీవీఎస్ జూపిటర్ 125 రెండు చక్రాలపై కలిపి బ్రేకింగ్ సిస్టమ్‌ను పొందుతుంది. టీవీఎస్ జూపిటర్ 125 స్కూటీ ఎక్స్ షోరూమ్ ధర రూ.85,468 నుంచి ప్రారంభం అవుతుంది. 










Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial