Simple Dot One Launched: బెంగళూరు ఆధారిత ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారు సింపుల్ ఎనర్జీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ ఎనర్జీ వన్‌లో చవకైన వేరియంట్‌ను పరిచయం చేసింది. కంపెనీ ఇప్పటికే దీని బుకింగ్‌ను ప్రారంభించింది. దీని ధర రూ. 1.40 లక్షల ఎక్స్ షోరూమ్‌గా నిర్ణయించారు. కొత్త కస్టమర్‌లు 2024 జనవరి 27వ తేదీ నుంచి నామమాత్రపు టోకెన్ మొత్తం రూ.1,947తో ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు వన్ నుంచి డాట్ వన్‌కు మారాలనుకునే ప్రస్తుత కస్టమర్లకు బుకింగ్‌లో ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ తెలిపింది.
డిజైన్ ఎలా ఉంది?
వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు, డిజైన్ డాట్‌లో ఉంచారు. అయితే బ్యాటరీ ఆప్షన్ మాత్రం ముందు వెర్షన్‌లానే ఉంది. ఇది డ్యూయల్ బ్యాటరీ సెటప్ కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. దీని కారణంగా డాట్ వన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ముందు వెర్షన్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇది తప్ప పెద్ద మార్పులేమీ కనిపించలేదు.
బ్యాటరీ ప్యాక్, రేంజ్ ఇలా...
డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకే వేరియంట్‌లో మార్కెట్లోకి వచ్చింది. 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందించగలదు. దీన్ని కంపెనీ తన విభాగంలో అత్యధికం అని పేర్కొంది. ఈ స్కూటర్‌లో 8.5 కేడబ్ల్యూహెచ్ ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది 72 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ కేవలం 2.7 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
లక్షణాలు ఎలా ఉన్నాయి?
సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో సీబీఎస్ డిస్క్ బ్రేక్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్‌లు కూడా ఉన్నాయి. దీన్ని నాలుగు కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. లైట్ఎక్స్, బ్రేజెన్ఎక్స్ ఆప్షన్లు కూడా పరిచయ ఆఫర్‌లుగా అందుబాటులో ఉన్నాయి.
ఓలా ఎస్1తో పోటీ?
డాట్ వన్ దేశీయ మార్కెట్‌లో ఓలా ఎస్1తో పోటీపడనుంది. దేశీయ మార్కెట్‌లో దీని ధర రూ. 92,300 నుండి రూ. 1,29,828 వరకు ఉంది. ఇది ఎక్స్ షోరూమ్ ధర.
మరోవైపు 2024లో టాటా.ఈవీ కంపెనీ కర్వ్ ఎస్‌యూవీ రూపంలో పెద్ద లాంచ్‌కు సిద్ధం అవుతోంది. టాటా కర్వ్ 4 మీటర్ ప్లస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ స్పేస్‌లో మార్కెట్లోకి రానుంది. హారియర్, నెక్సాన్ మధ్య స్థానంలో ఇది ఉంటుంది. 2024లో మొదటగా కర్వ్ ఈవీ లాంచ్ అవుతుంది. దాని పెట్రోల్ వేరియంట్ తరువాత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో ఈ కారును మొదట ప్రదర్శించారు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!