Royal Enfield Goan Classic 350 Launch Date: బ్రిటిష్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త 350 సీసీ బైక్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350ని భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ బైక్ నవంబర్ 23వ తేదీన భారత మార్కెట్లోకి రానుంది. ఇది జే-ప్లాట్‌ఫారమ్ ఆధారంగా లాంచ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదో మోటార్‌సైకిల్. ఈ బైక్‌ను మోటోవర్స్ 2024లో లాంచ్ చేసే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా మనదేశంలో పండుగల సందర్భంగా కొత్త బైక్‌లను లాంచ్ చేస్తూ ఉంటుంది. 2023లో రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650ని కొత్త ప్రొడక్ట్‌గా లాంచ్ చేశారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 ఎలా ఉంటుంది?
ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లోని పవర్‌ట్రెయిన్ క్లాసిక్ 350 మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ బైక్ స్టైలింగ్ ఫీచర్లు కొంత భిన్నంగా ఉండవచ్చు. ఈ బైక్‌కు సంబంధించి లీకైన ఫోటోను బట్టి చూస్తే ఈ మోటార్‌సైకిల్ యూ-ఆకారపు హ్యాండిల్‌బార్‌తో రావచ్చని తెలుస్తోంది. ఈ బైక్‌లో పొడవైన విండ్‌స్క్రీన్‌ని కూడా చూడవచ్చు. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ వైట్ వాల్ టైర్లు, సింగిల్ సీటుతో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. పిలియన్ సీటు ఎంపికను కూడా బైక్‌లో చూడవచ్చు.
Also Read: సేఫ్టీ రేటింగ్‌లో దుమ్ము దులుపుతున్న థార్ రోక్స్ - సెక్యూరిటీ ఫీచర్లు అదుర్స్!
ఏ ఇంజిన్ అందించనున్నారు?
జే-సిరీస్ మోటార్‌సైకిళ్లకు లభించే శక్తిని ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కూడా పొందుతుంది. ఈ బైక్‌లో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉండనుంది. ఈ ఇంజన్‌కు 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా పెయిర్ చేయవచ్చు. బైక్‌లోని ఈ ఇంజన్ 20 బీహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను కూడా జనరేట్ చేస్తుంది.
దీని ధర ఎంత ఉంటుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది ప్రారంభంలో క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మోటార్‌సైకిల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.93 లక్షల నుంచి మొదలై రూ. 2.30 లక్షల వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ కొత్త బైక్ గోవాన్ క్లాసిక్ 350 ధర రూ. రెండు లక్షల కంటే ఎక్కువ ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించిన మిగిలిన వివరాలను లాంచ్ సమయంలో మాత్రమే వెల్లడించే అవకాశం ఉంది.
గత కొన్ని సంవత్సరాల నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో ఏ బైక్‌ను లాంచ్ చేసినా అవి సక్సెస్ అవుతున్నాయి. కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుందనే అనుకోవాలి.
Also Read: రూ.10 లక్షల్లోపు ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కార్లు ఇవే - మహీంద్రా నుంచి మారుతి వరకు!