Koona Ravikumar: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గాల్లో కాళింగ వర్గం ఒకటి.అయితే కళింగులకు మంత్రి పదవి దక్కకపోగా మరి ఏ ఇతర కీలక పదవులు వరించలేదు. టిడిపి కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన కళింగులు అధికారంలోకి వచ్చాక అవకాశాలు రాకపోవడంతో నాయకులు సంగతి ఎలా ఉన్నా కళింగ సామాజికవర్గంలో అసంతృప్తి రేగుతోంది.
మంత్రి పదవి ఆశించిన కూన రవికుమార్
తెలుగుదేశం పార్టీలో యువజన విభాగం నుంచి పనిచేస్తూ వచ్చిన రవికుమార్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆమదాలవలస నియోజకవర్గంలో రాజకీయాలు చేయడమంటే ఆషామాషీ కాదు. పార్టీల బలాబలాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు దాదాపు సమానంగానే ఉంటాయి. అయినప్పటికీ రవి కుమార్ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కొంత కాలం విప్ గానూ బాధ్యతలు నిర్వహించారు. అంత కు ముందు ఎంపిపి, జెడ్పిటిసిలాంటి పదవులు దశాబ్ద న్నర కాలం పాటు నిర్వహించిన చరిత్ర ఉంది. కేవలం కళింగ సామాజిక వర్గానికే కాకుండా ఇతర సామాజిక వర్గాలకు ఇతను పెద్ద దిక్కు. మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఆ పదవి తప్పిపోవడంతో మంత్రి తరహాలోనే క్యాబినెట్ హోదా ఉన్న చీఫ్ విప్ పదవి కూన రవికుమార్‌కు వస్తుందనుకున్నారు. అయితే అది కూడా రాలేదు.
Also Read: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
పదవి కోసం చూస్తున్న బెందాళం అశోక్
తెలుగుదేశం పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గానికి మూడుసార్లు శాసనసభ్యుడు. 12 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఈయన ఇచ్ఛాపురం నియోజకవర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి ఈయన తండ్రి దివంగత బెందాళం ప్రకాష్ చురుకైన నాయకుడే. గతంలో మంత్రి పదవి కళింగ సామాజికవర్గానికి వస్తుందనుకుంటే చివరి నిమిషంలో పార్టీలోని పెద్దలే కొందరు తప్పించారన్నది బహిరంగ రహస్యం. పోటీ వాతావరణం సృష్టించడంతో కళింగ సామాజికవర్గానికి ఈ పదవి దక్కకుండాపోయింది.
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
ప్రాధాన్యత కోరుకుంటున్న కాళింగ వర్గం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. కళింగ సామాజిక వర్గంలో తమ్మినేని సీతారాం మేనల్లుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ్మినేని సీతారం స్పీకర్ గా ప్రాతినిధ్యం వహించారు ఆ టైంలో తమ్మినేని సీతారాం కోన రవికుమార్ కు కొన్ని ఇబ్బందులు పెట్టడంతో కచ్చితంగా కోన రవికుమార్ కి మంత్రి పదవి ఇస్తారని అప్పుల్లో ఊహాగానాలు చెక్కర్లు కొట్టాయి. అయితే ఆ సమయంలో మంత్రిగా కొన రవికుమార్ కి సీటు దక్కకపోవడం అచ్చం నాయుడుకి సీటు దక్కడంతో కొన్నాళ్లు పాటు కొన రవికుమార్ అలకలో కూడా వెళ్లారు. గన్మెన్ కూడా కనీసం ఉంచుకోకుండా నాకు అవసరం లేదని చెప్పేయడం అది పెద్ద దుమారంగానే మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి కొన్న రవికుమార్ కి పార్టీ ఏదో ఒకటి చేస్తుంది అని చెప్పడంతో కొంత కూలయ్యారని సమాచారం కూడా ఉంది.