Royal Enfield Electric Motorcycle: భారతీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాహన తయారీ సంస్థ మనదేశంలో మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విడుదలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ అంతకు ముందే ఈ ఎలక్ట్రిక్ వాహనం మొదటి ఫోటో లీక్ అయింది. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ప్రొటోటైప్ కావచ్చని అంచనా.


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే తన ఎలక్ట్రిక్ బైక్ గురించిన టీజర్‌ను షేర్ చేసింది. ఇందులో రాయల్ ఎన్‌ఫీల్డ్ నవంబర్ 4వ తేదీని ప్రత్యేకంగా పేర్కొంది. దీన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ కారు నవంబర్ 4వ తేదీన మార్కెట్లో లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. ఈ బైక్ పనితీరుతో పాటు రేంజ్‌పై కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ దృష్టి పెట్టింది.



Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ రేంజ్ ఎంత?
ఈ బ్రాండ్‌లోని ఇతర బైక్‌ల కంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ స్లిమ్ బాడీతో రావచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు సిటీ రైడ్‌లకు మంచి ఆప్షన్. ఈ మోటార్‌సైకిల్ లుక్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ 100 నుంచి 160 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అంటే సింగిల్ ఛార్జింగ్‌తో ఇది 100 నుంచి 160 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంది. కాబట్టి ఇది కేవలం సిటీ రైడ్లకు తప్ప లాంగ్ డిస్టెన్స్ రైడింగ్‌కు పనికి రాదని అనుకోవచ్చు.


రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ ధర ఎంత?
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, రేంజ్ వాహనం ధరను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర ట్రెడిషనల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కంటే ఎక్కువగా ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లో అనేక ఫీచర్లను అందించనుంది. ఇందులో రైడింగ్ మోడ్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లో అల్లాయ్ వీల్స్... అలాగే డిస్క్ బ్రేక్‌లు కూడా ఉంటాయి.


ఈ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసిన తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ మరిన్ని మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చు. దీని తరువాత రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ మోడల్‌ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బైక్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ల మార్కెట్లోకి కూడా అడుగుపెట్టనుంది. మరి ఈ విభాగంలో పోటీని కంపెనీ ఎలా తట్టుకుంటుందో చూడాలి.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?