2024 Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వెర్షన్‌ను కంపెనీ అప్‌డేట్ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత కంపెనీ ఈ బైక్‌ను కొత్త జే-ప్లాట్‌ఫారమ్‌తో తీసుకొచ్చింది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో అనేక కొత్త ఫీచర్లు చేర్చారు. దీంతో పాటు బైక్‌లో కొత్త కలర్ వేరియంట్‌లు కూడా అందించారు.
క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ బైక్ ధర గురించి సమాచారం సెప్టెంబర్ 1వ తేదీన రివీల్ చేయనున్నారు. కంపెనీ ఈ కొత్త మోడల్‌కు సంబంధించిన డెలివరీ కూడా అదే రోజు నుంచి ప్రారంభించనుంది.
కొత్త క్లాసిక్ 350 డిజైన్ ఎలా ఉంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కూల్ లుక్‌తో వచ్చింది. ఈ బైక్‌కు పెద్ద మడ్‌గార్డ్‌ను అమర్చారు. ఈ బైక్ డిజైన్‌ను మరింత మెరుగుపరచడానికి కంపెనీ కొన్ని ఆధునిక ఫీచర్లను జోడించింది. ఈ బైక్‌లో అన్నిచోట్లా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. ఇందులో అడ్జస్టబుల్ లివర్‌ను కూడా చూడవచ్చు. ఈ బైక్‌లో యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పాయింట్‌ను కూడా కంపెనీ అందించింది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఇంజిన్ ఎలా ఉంది?
అప్‌డేట్ చేసిన క్లాసిక్ 350 కొన్ని వేరియంట్లలో, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు ఉపయోగిస్తున్నారు. ఇవి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ మోడర్న్ టచ్‌కు రెట్రో రూపాన్ని ఇస్తున్నాయి. ఈ బైక్ పవర్‌ట్రెయిన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ బైక్‌లో ఎయిర్/ఆయిల్ కూల్డ్, 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 20.2 బీహెచ్‌పీ పవర్, 27 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
కొత్త కలర్ వేరియంట్‌తో...
ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఐదు థీమ్‌ల్లో 11 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లో ఐదు రంగుల థీమ్‌లను అందించింది. అవే క్రోమ్, హాల్సియాన్, మాటే, సిగ్నల్స్, రెడ్ డిచ్. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్ ఆరు కలర్ ఆప్షన్లతో వస్తుంది. వీటిలో ఎమరాల్డ్, జోధ్‌పూర్ బ్లూ, మద్రాస్ రెడ్, మెడలియన్ బ్రౌన్, కమాండో సాండ్, స్టెల్త్ బ్లాక్ ఉన్నాయి.
2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అంచనా ధర...
2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అప్‌డేటెడ్ మోడల్ ధర ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మోడల్ కంటే ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 2024 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.93 లక్షల నుంచి రూ.2.2 లక్షల వరకు ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?