Best Bikes Under 2 Lakhs: ప్రస్తుతం యూత్ బైక్‌పై లాంగ్ జర్నీలు చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. దీని కోసం శక్తివంతమైన ఇంజిన్‌లతో కూడిన బైక్‌లను కొనడం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి బైక్‌ల గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అందుకే ఈరోజు మనం రూ. రెండు లక్షల లోపు ధరలో ఉన్న కొన్ని మంచి బైక్‌ల గురించి తెలుసుకుందాం. ఇందులో శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు ఆకర్షణీయమైన డిజైన్‌ ఉన్న బైక్స్ కూడా ఉన్నాయి.


రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకువచ్చిన ఈ బైక్ దేశంలో చాలా ప్రజాదరణ పొందింది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.73 లక్షలుగా నిర్ణయించారు. అయితే దీని టాప్ వేరియంట్ ధర రూ. 2.15 లక్షల వరకు ఉంది. ఈ బైక్‌లో 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 27 ఎన్ఎం పీక్ టార్క్‌తో 20.4 పీఎస్ పవర్‌ని జనరేట్ చేస్తుంది.


అలాగే ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ అయింది. ఈ బైక్‌లో దాదాపు 13 లీటర్ల పెద్ద ఇంధన ట్యాంక్ కూడా ఉంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ బైక్ లీటరుకు దాదాపు 37 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అలాగే ఈ బైక్‌లో హాలోజన్ హెడ్‌లైట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.


జావా 42 (Java 42)
జావా మోటార్‌సైకిల్ లాంచ్ చేసిన అత్యంత ప్రసిద్ధ బైక్ జావా 42 అని చెప్పవచ్చు. ప్రజలు ఈ బైక్ డిజైన్‌ను చాలా ఇష్టపడతారు. సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ వంటి రెండు వేరియంట్లలో కంపెనీ ఈ బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్‌లో కంపెనీ 294.72 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డీవోహెచ్‌సీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 27.32 పీఎస్ పవర్‌తో 26.84 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.


అలాగే ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లాంచ్ అయింది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ బైక్ లీటరుకు 33 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. ఇది మాత్రమే కాకుండా అనలాగ్ స్పీడోమీటర్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హజార్డ్ వార్నింగ్ లైట్ వంటి అనేక ఫీచర్లు కూడా బైక్‌లో అందించారు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.98 లక్షలుగా ఉంది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే


బజాజ్ అవెంజర్ క్రూయిజ్ 220 (Bajaj Avenger Cruise 220)
బజాజ్ ఆటో మార్కెట్లోకి తెచ్చిన ఈ క్రూయిజర్ బైక్ దేశంలోని యువతకు బాగా నచ్చింది. బజాజ్ ఈ బైక్‌లో 220 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ 19.03 PS పవర్, 17.55 ఎన్ఎం పీక్ టార్క్ జనరేట్ చేయగలదు.


అలాగే ఇది 5 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్ అయింది. ఈ బైక్ లీటరుకు 40 కిలోమీటర్ల వరకు మైలేజీని కూడా ఇస్తుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన పెద్ద విండ్‌షీల్డ్, సర్వీస్ డ్యూ రిమైండర్ వంటి ఫీచర్లను కూడా ఈ బైక్ కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.44 లక్షలుగా ఉంది.


కేటీయం డ్యూక్ 200 (KTM Duke 200)
కేటీయం బ్రాండ్ మన దేశంలో చాలా ప్రజాదరణ పొందింది. కేటీయం డ్యూక్ 200 మనదేశంలో సూపర్ హిట్. నగరాల్లో ఈ బైక్‌కు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా యువత కేటీఎం బైక్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ బైక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, సిల్వర్ మెటాలిక్ మ్యాట్, డార్క్ గాల్వనో మూడు కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఈ బైక్‌లో 199.5 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు.


ఈ ఇంజన్ 25 పీఎస్ పవర్‌తో 19.3 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో కూడా కనెక్ట్ చేయబడింది. కేటీయం డ్యూక్ 200లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టాకోమీటర్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో కూడిన ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ 33 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.98 లక్షలుగా నిర్ణయించారు.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?