Revolt RV400 Stealth Black: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివోల్ట్ తన బైక్ ఆర్‌వీ400 స్టెల్త్ బ్లాక్ ఎడిషన్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ తన ఆరో వార్షికోత్సవం సందర్భంగా దీన్ని విడుదల చేసింది. దీని ధర 1.17 లక్షలుగా (ఎక్స్ షోరూమ్‌) నిర్ణయించారు. ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి అధికారిక డీలర్‌షిప్‌లో లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ బైక్‌కు సంబంధించి లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే విక్రయించనుంది. అంటే కొన్ని యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయన్న మాట. దీని డెలివరీ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.


రివోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్
సాధారణ మోడల్‌తో పోలిస్తే రివోల్ట్ ఆర్వీ400 స్టెల్త్ బ్లాక్ ఎడిషన్‌లో పెద్దగా ఏమీ మార్పులు చేయలేదు. ఈ మోడల్‌లో బైక్ స్వింగ్‌ఆర్మ్, రేర్ గ్రాబ్ హ్యాండిల్, బైక్ ఫ్రేమ్‌లోని కొన్ని భాగాలు, హ్యాండిల్ బార్‌లోని క్రోమ్ ట్రిమ్ కూడా నలుపు రంగులో కనిపిస్తాయి. ఇది కాకుండా ఎల్లో మోనోషాక్‌తో ఉన్న ఫ్రంట్ ఫోర్క్‌కు గోల్డ్ కలర్, అల్లాయ్ వీల్‌కు బ్లాక్ కలర్ వేశారు. బైక్‌కు స్టెల్త్ బ్లాక్ పెయింట్‌తో పాటు ముందు భాగంలో చిన్న బ్లాక్ ఫ్లాట్ స్క్రీన్ కూడా అందించారు.


రివోల్ట్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు, ఇతర వివరాలు
పైన చెప్పినట్లుగా ఈ కొత్త ఎడిషన్‌లో కొన్ని కాస్మిక్ మార్పులు మాత్రమే చేశారు. అందువల్ల పవర్ ఇంజిన్ కూడా సాధారణ మోడల్ తరహాలోనే ఉంటుంది. దీనిలో 3.24 కేడబ్ల్యూహెచ్ లయన్ బ్యాటరీ ప్యాక్ అందించారు. 3 కేడబ్ల్యూ మిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంది. ఇది ఏకంగా 156 కిలోమీటర్ల వరకు రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లుగా ఉంది. ఈ బైక్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది.


వేటితో పోటీ?
రివోల్ట్ ఆర్వీ400 బైక్‌తో పోటీపడే ఎలక్ట్రిక్ బైక్‌ల జాబితాలో మేటర్ ఐరా, టార్క్ క్రాటోస్, కాంకీ రేంజర్, ఒడిస్సీ ఎలక్ట్రిక్ బైక్‌లు ఉన్నాయి. రివోల్ట్ ఆర్వీ400 సాధారణ వెర్షన్‌కు కలర్, డిజైన్ ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు లాంచ్ అయిన వెర్షన్ మరింత ఆకర్షణీయంగా ఉంది.


మరోవైపు టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే టీవీఎస్ ఎక్స్. టీవీఎస్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 4.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, 11 కేడబ్ల్యూ పీఎంఎస్ఎం మోటార్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 140 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 105 కిలోమీటర్ల వరకు గరిష్ట వేగం అందించనుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టీవీఎస్ ఎక్స్ కేవలం గంటలోనే 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కగలదు.


Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?


Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial