Chittoor Crime News: సాధారణంగా స్కూల్స్ విద్యాబ్యాసం రోజులు చాలా హాయిగా గడిచి పోతాయి. ఎలాంటి కల్మషం లేకుండా అందరూ కలిసి మెలసి అల్లరి చేస్తూ చదువును అభ్యసిస్తుంటారు. తరగతి గదిలో అల్లరి చేస్తున్న ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు క్రమశిక్షణతో దండచడమే ఆ బాలిక పాలిట శాపంగా మారింది. తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులకు సర్ది చెప్పి ఇద్దరిని మందలచాల్సిన ఉపాధ్యాయుడు ఒక బాలిక పట్ల మాత్రమే కఠినంగా వ్యవహరించడం ఆ బాలిక తట్టుకోలేక పోయింది. అందరూ చూస్తుండగా ఉపాధ్యాయుడు తనకు పనిష్మెంట్ ఇస్తాడేమోనని భయపడిన ఆ బాలిక బలవన్మరణానికు పాల్పడింది. అయితే మొదట్లో బాలిక బలవన్మరణానికి పాల్పడేందుకు కారణాలు తెలియని తల్లిదండ్రులు బాలికకు కన్నీటి వీడ్కోలు పలికి శోకసంద్రంలో మునిగి పోయారు. ఆ తర్వాత బాలిక సెల్పీ వీడియో, సూసైడ్ నోట్ ఆలస్యంగా బయటకు వచ్చింది.


చిత్తూరు జిల్లా కుప్పం మండలం నూలుకుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్.రమ్య (13) తొమ్మిదో తరగతి చదువుతూ ఆ తరగతికి లీడర్ గా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల తరగతి గదిలో ఉపాధ్యాయుడు లేని సమయంలో ఓ విద్యార్థి అల్లరి చేయడాన్ని గమనించిన రమ్య, ఆ విద్యార్ధిని చేసేది తప్పని దండించింది. ఈ విషయం‌ కాస్తా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వరకూ వెళ్లింది. ఇదే విషయాన్ని బెంగళూరులో కూలీ పనులు చేసుకుంటున్న రమ్య తండ్రికి ప్రధానోపాధ్యాయుడు ఫోన్ చేసి చెప్పడంతో రమ్య మనోవేదనకు గురి అయ్యింది. అయితే తనూ లీడర్ గా ఇకపై ఉండబోనని చెప్పినా, ఉపాధ్యాయులు అందుకు ఒప్పుకోలేదు.


ఈ క్రమంలోనే ఇటీవల మరో విద్యార్ధి అల్లరి చేయడంతో మొదట్లో తప్పని చెప్పినా ఆ విద్యార్ధి మాట వినకపోయే సరికి రమ్య మందలించింది. ఈ క్రమంలోనే రమ్య మాటలను విన్న ఆ ఉపాధ్యాయుడు.. విద్యార్థిని కులం పేరుతో దూషించావంటూ కోపగించుకున్నాడు. ఆ విషయాన్ని అందరికి చెబుతాననడంతో.. తాను ఏ తప్పూ చేయలేదని, అల్లరి చేస్తున్న విద్యార్ధిని దారిలో పెట్టేందుకే అలా మాట్లా డాను అని రమ్య చెప్పినా ఉపాధ్యాయుడు వినిపించుకోలేదు. 


దీంతో తీవ్ర‌ మనోవేదనకు గురైనా రమ్య, ఎక్కడ తనపై పాఠశాలలో అందరి ముందు చర్యలు తీసుకుంటారేమోననే భయంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికు పాల్పడింది. అయితే ఆత్మహత్యకు పాల్పడక ముందు రమ్య వీడియో రికార్డు చేయడంతో పాటు తన భాధను సూసైడ్ లెటర్ లో వివరించింది. "అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను చనిపోతున్నా.. పాఠశాలలో నేను చేయని తప్పుకు ఎక్కడ నాకు పనిష్మెంట్ ఇస్తారేమోనని, నా పరువు పోతుందనే భయంతోనే నేను చనిపోతున్ననాను"  అంటూ లేఖలో పేర్కొంది. అలాగే తనకు స్కూల్ లో రవి, సునీత, కమల, ఆంజనేయులు, జగన్నాథం, శివశంకర్, హెచ్ఎం సార్ అంటే ఎంతో ఇష్టంమని, ఎప్పుడైనా తను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి అని లేఖలో వేడుకుంది. అయితే దశరధన్ సార్ తనను ఎంత తిట్టినా, కొట్టినా కూడా ఇష్టమేనని అందులో రాసింది. అయితే బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకూ కేసు నమోదు చేసిన పోలీసులు, సెల్పీ వీడియో, సూసైడ్ లెటర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.