Navaratri-Diwali Offer On Electric Scooter: దేశవ్యాప్తంగా ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఈ పండుగను ప్రజలతో కలిసి జరుపుకునేందుకు పలు బైక్‌లు, స్కూటర్ల తయారీ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి. ఈ నవరాత్రి పండుగల ఉత్సాహంతో ఓలా తన ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను కూడా తగ్గించింది. రూ.75,000 ఉన్న ఓలా స్కూటర్ ధర ఏకంగా రూ.25 వేలు తగ్గింది. దీంతో ఇప్పుడు ఈ బైక్ ధర రూ.49,999 నుంచి ప్రారంభం కానుంది.


ఓలా సీజన్ సేల్ ఆఫర్
ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సీజన్ సేల్ ఆఫర్‌ను అక్టోబర్ 2వ తేదీన ప్రకటించారు. ఈ ఆఫర్ అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. ఓలా ఎస్1 అనేది ప్రముఖ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఇప్పుడు రూ.49,999 నుంచి ప్రారంభం అవుతుంది.






ఏకంగా రూ.25 వేలు తగ్గింపు
అక్టోబర్ 2వ తేదీ రాత్రి వరకు ఓలా ఎస్1 ప్రారంభ ధర రూ.74,999గా ఉంది. ఇప్పుడు ఈ ఈవీ ప్రారంభ ధర రూ.25,000 తగ్గింది. ఈ ఆఫర్ నవరాత్రి నుంచి దీపావళి వరకు అందుబాటులో ఉండనుంది. మార్కెట్లో ఓలా ఎస్1కు సంబంధించి అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. నవరాత్రి దీపావళి ఆఫర్‌తో ఈ ఈవీ ధర రూ. 50,000 కంటే తక్కువకు వచ్చింది.


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


ఓలా ఎస్1ఎక్స్ (Ola S1x)
ఓలా ఎస్1ఎక్స్X మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌లో 2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 95 కిలోమీటర్ల రేంజ్‌ను, 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 151 కిలోమీటర్ల రేంజ్‌ని, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 193 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఓలా ఎస్1ఎక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది.


ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air)
ఓలా ఎస్1 ఎయిర్ 6 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సర్టిఫైడ్ రేంజ్ 151 కిలోమీటర్లుగా ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,07,499 నుంచి ప్రారంభం అవుతుంది.


ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)
ఓలా ఎస్1 ప్రో 11 కేడబ్ల్యూ గరిష్ట శక్తిని అందిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌తో 195 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఈవీ గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఆఫర్‌కు ముందు ఓలా ఎస్1 ప్రో ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభ ధర రూ.1,34,999గా ఉండేది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?