ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఆ కంపెనీ S1పేరుతో భారత్‌లో ఆగస్టు15 సందర్భంగా విడుదల చేసింది. కొత్త ఫీచర్లు, డిజైన్లతో తీసుకొచ్చిన స్కూటర్ ధరను మాత్రం అదిరిపోయేలా ఉంది. 


మామూలుగా లేదు


లాంచ్‌కు ముందే దీనిపై హైప్‌ క్రియేట్ చేసింది ఓలా కంపెనీ. ముందస్తు బుకింగ్ పేరుతో జనాలను భారీగా అట్రాక్ట్ చేసింది. కేవలం ఐదు వందల టోకెన్ అమౌంట్‌తో బుక్‌చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. 


ధర లక్షకుపైనే


ఇందులో రెండు రకాల వేరియేషన్స్‌ తీసుకొచ్చింది ఓలా సంస్థ. ఒకటి S1గా చెబుతోంది. రెండోది S1 ప్రోగా జనాల ముందు తీసుకొస్తోంది. S1 ధర రూ.99, 999 రూపాయలుగా ఓలా సంస్థ నిర్ణయించింది. S1 ప్రో ధరను లక్షా 29వేల 999గా చెబుతోంది. ఇవి ఎక్స్‌షోరూం ధరలు. 
Also Read: Tata EV Sedan Tigor: టాటా నుంచి టైగోర్ కారు.. వచ్చే వారంలో రిలీజ్.. ధర ఇంత ఉంటుందా?


 ఆ స్కీమ్‌లో ఉండే బెటర్


FAME(Faster Adoption and Manufacture of Electric Vehicles) స్కీమ్‌ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఈ ధరలు ఇంకా తగ్గనున్నాయి. ఆ రేట్లు చూస్తే.. ఢిల్లీలో రూ.85,099 నుంచి ప్రారంభమవుతుంది. గుజరాత్‌లో  రూ.79,999 నుంచి స్టార్ట్‌ అవుతుంది. మహారాష్ట్రలో రూ.94,999 నుంచి ప్రారంభమవుతుంది. రాజస్థాన్‌లో రూ.89,968 నుంచి స్టార్ట్ అవుతుంది. 


అక్టోబర్‌ నుంచి డెలవరీ


ముందుగా బుక్‌ చేసుకున్న వాళ్లకు అక్టోబర్ నుంచి స్కూటర్ డెలవరీ చేస్తున్నట్టు ఓలా సంస్థ ప్రకటించింది. ఈ స్కూటర్‌ను నెలసరి వాయిదాల్లో చెల్లించి కూడా పొంద వచ్చు.  నెలకు రూ. 2,999 వరకు చెల్లించి ఈ స్కూటర్‌ సొంతం చేసుకోవచ్చు. ఇంట్రస్ట్ ఉన్న వాళ్లకు  బుకింగ్స్‌ త్వరలోనే స్టార్ట్ చేస్తారు. 
Also Read: Audi India New Launch: ఆడీ కార్ల ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వివరాలు తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!


నాలుగు సెకన్లలోనే 40 కిలోమీటర్లు


ఓలా S1 స్కూటర్‌పై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. 0 టు 40 KMPH స్పీడ్‌తో 3.6 సెకన్లలోనే వేగాన్ని అందుకోవచ్చు. 
8.5కిలోవాట్స్‌తోనే 121కిలోమీటర్లు ట్రావెల్ చేయవచ్చు. 


ప్రోలో ఫీచర్స్‌ సూపర్


ఓలా S1ప్రో  మూడుసెకన్లలోనే  సున్నా నుంచి నలభై కిలోమీటర్ల స్పీడ్ అందుకోవచ్చు. దీనిపై గరిష్టంగా 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు. ఇది 8.5K.Wతోనే 181కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 


పది రంగులు-మూడు మోడల్స్


ప్రో స్కూటర్‌ సుమారు పది రంగుల్లో వస్తోంది. ఇది పేస్టల్, మేట్, మెటాలిక్‌లో రానుంది. 


హోం డెలివరీ


దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా నగరాల్లో దీన్ని ప్రీబుకింగ్ చేసుకున్నారు. అన్ని నగరాలకు త్వరలోనే డెలవరీలు పంపిస్తామంటోంది ఓలా కంపెనీ. కస్టమర్లకు ఇబ్బంది లేకుండా S1స్కూటర్‌ను హోండెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. 
Also Read: Tata Tiago NRG Launch: రెండు వేరియంట్లతో టాటా టియాగో ఎన్ఆర్‌జీ వచ్చేసింది