New Nissan Magnite Price: నిస్సాన్ ఇండియా భారత మార్కెట్లో మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. నిస్సాన్ మాగ్నైట్ మొదటిసారిగా 2020 సంవత్సరంలో భారతదేశంలో లాంచ్ అయింది. అప్పటి నుంచి కంపెనీ ఈ కారును 1.5 లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ అనేక అప్‌డేట్‌లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.


నిస్సాన్ మాగ్నెట్ ఫేస్‌లిఫ్ట్‌లో ప్రత్యేకత ఏమిటి?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ మోడర్న్, డైనమిక్ డిజైన్‌తో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ నిస్సాన్ కారులో ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌కి కొత్త రంగు సన్‌రైజ్ కాపర్ ఆరెంజ్ ఇవ్వబడింది. ఈ ఎస్‌యూవీ మొత్తం 13 రంగులలో లాంచ్ అయింది. ఇందులో ఎనిమిది మోనోటోన్, ఐదు డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్‌లు ఉన్నాయి.


ఈ నిస్సాన్ కారులో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో క్లస్టర్ అయోనైజర్ ఉంది. ఈ డివైస్ సహాయంతో కారు లోపల గాలిని శుభ్రం చేయవచ్చు. దీంతో పాటు హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగించవచ్చు. 


Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే


నిస్సాన్ మాగ్నెట్ ఇంజిన్ ఎలా ఉంది?
నిస్సాన్ మాగ్నైట్ అప్‌డేటెడ్ మోడల్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ కారు 1.0 లీటర్ టర్బో ఇంజన్‌తో లభిస్తుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ కారు ఇంజన్‌కి పెయిర్ అయిన మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, సీవీటీతో ఈ కారు 17.4 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు.


మాగ్నెటిక్ ఫేస్‌లిఫ్ట్ సెక్యూరిటీ ఫీచర్లు ఎలా ఉన్నాయి?
నిస్సాన్ ఈ కారులోని సేఫ్టీ ఫీచర్లపై ప్రత్యేక దృష్టి సారించింది. లాంచ్ ఈవెంట్‌లో 55 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లను ఉపయోగించామని, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీంతో పాటు వెహికల్ డైనమిక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, హిల్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్లు కూడా అందించారు.


నిస్సాన్ మాగ్నెట్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత?
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌కి అనేక భద్రతా ఫీచర్లు జోడించారు. ఈ కారులో కంపెనీ 336 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తోంది. కొత్త ఫీచర్ల తర్వాత కూడా ఈ కారు ధరలో ఎలాంటి పెంపు లేదు. నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.



Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?