హ్యుండాయ్ ఈ సంవత్సరం అల్కజార్ కారును లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే సంవత్సరం ఎన్నో కొత్త ఉత్పత్తులను కంపెనీ లాంచ్ చేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టక్సన్ సేల్ కూడా మొదలై పోయింది. ఇప్పుడు కొత్త టక్సన్ కారును కూడా కంపెనీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ కొత్త వేరియంట్ మోడల్స్‌కు సంబంధించి ట్రయల్స్ కూడా మొదలైనట్లు సమాచారం. ఈ కొత్త జనరేషన్ మోడల్‌ను బాగా మేకోవర్ చేశారు. ఇందులో పెద్ద గ్రిల్ కూడా అందుబాటులో ఉంది. హెడ్ ల్యాంప్స్ కొద్దిగా పక్కకి ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న వేరియంట్ కంటే దీని సైజు కొంచెం పెద్దగా ఉండనుంది.


దీని లుక్ కూడా మరింత ప్రీమియం తరహాలో ఉంది. వెనకవైపు కొత్త తరహా స్టైలింగ్‌ను అందించారు. వెనకవైపు ల్యాంప్స్‌కు లైట్ బార్‌ను కూడా అందించారు. దీని ఇంటీరియర్ కూడా కొత్తగా ఉంది. 10.25 అంగుళాల స్క్రీన్లను ఇందులో అందించారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ కారులో ఉంది.


ఇందులో త్రీ జోన్ క్లైమెట్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్, అప్‌డేట్ చేసిన బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీని అందించారు. ఈ కొత్త తరం టక్సన్‌లో పెద్ద వీల్ బేస్ కూడా ఉండనుంది. ఇందులో 2.5 లీటర్ పెట్రోల్ లేదా 1.6 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్లు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం 2.0 లీటర్ల వేరియంట్ అల్కజార్‌లో కూడా ఉంది.


మాన్యువల్/ఆటోమేటిక్ ఆప్షన్లతో డీజిల్ ఇంజిన్ కూడా ఇందులో ఉండనుంది. కొత్త టక్సన్ ముందున్న వేరియంట్ కంటే కచ్చితంగా ఎక్కువ ధరతోనే లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. అయితే హ్యుండాయ్ ధరల విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంది కాబట్టి.. మిగతా కార్లకు గట్టిపోటీని ఇచ్చే విధంగానే దీని ధర ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త టక్సన్ సిట్రియోన్ సీ5 ఎయిర్ క్రాస్, జీప్ కంపాస్‌లతో పోటీ పడనుంది.


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?


Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి