లగ్జరీ వెహికిల్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తన అరుదైన కారును విక్రయించింది. 300 ఎస్ఎస్ఆర్ ఊలెన్‌హాట్ కూప్స్ కార్లు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని బెంజ్ విక్రయించింది. ఈ కారును ఒక ప్రైవేట్ కలెక్టర్‌కు విక్రయించారు.
ఏకంగా 135 మిలియన్ యూరోలకు ఈ కారు అమ్ముడుపోవడం విశేషం. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.1108 కోట్లన్న మాట. ఈ కారును విక్రయించడం వెనుక మంచి కారణం ఉందని కంపెనీ సీఈవో తెలిపారు. గ్లోబల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం కోసం ఈ కారును విక్రయించినట్లు ఆయన తెలిపారు.
అయితే ప్రపంచంలో అత్యధిక విలువైన కారు మెర్సిడెస్ బెంజ్ కావడం తమకు చాలా గర్వకారణం అని పేర్కొన్నారు. ‘మెర్సిడెస్ బెంజ్ ఫండ్’ ద్వారా యువతకు విద్యకు సపోర్ట్ చేయనున్నట్లు కంపెనీ బోర్డు మెంబర్ తెలిపారు.