ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) 2023 జనవరికి సంబంధించిన వెహికల్ రిటైల్ డేటాను విడుదల చేసింది. ఆటో పరిశ్రమ ఊహించని విధంగా దూసుకుపోతుంది. ప్రీ-పాండమిక్ స్థాయి విక్రయాల సంఖ్యతో దూసుకుపోతోంది. ఈ నెలలో మారుతీ సుజుకి సేల్స్ చార్ట్‌లలో అగ్రస్థానాన్ని కొనసాగించింది. టాప్-5 లిస్ట్‌లో మిగతా నాలుగు కంపెనీల మొత్తం విక్రయాలు అన్నీ కలిపినా మారుతి కంటే తక్కువే. ఈ టాప్-10 లిస్ట్‌పై ఓ లుక్కేద్దాం...


1. మారుతీ సుజుకి
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ 2023 జనవరిలో 1,50,046 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే ఏకంగా 21,696 యూనిట్లు పెరిగింది. అంటే నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 16.90 శాతం వృద్ధి కనిపించిందన్న మాట. 2022 జనవరిలో కంపెనీ 1,28,350 యూనిట్లను విక్రయించింది.


2. హ్యుందాయ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ 2023 జనవరిలో 45,799 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 7,853 యూనిట్లు పెరిగింది. అంటే నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 20.69 శాతం వృద్ధి కనిపించింది. 2022 జనవరిలో కంపెనీ మొత్తంగా 37,946 యూనిట్లను విక్రయించింది.


3. టాటా మోటార్స్
టాటా మోటార్స్ లిమిటెడ్ కార్లు 2023 జనవరిలో 45,061 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 10,493 యూనిట్లు పెరిగింది. నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 30.35 శాతం వృద్ధిని కంపెనీ సాధించింది. 2022 జనవరిలో టాటా మోటార్స్ 34,568 యూనిట్లను విక్రయించింది.


4. మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కంపెనీ 2023 జనవరిలో 33,706 యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 13,868 యూనిట్లు ఎక్కువ. ఇది నెలవారీ విక్రయాలలో సంవత్సరం వారీగా చూస్తే ఏకంగా 69.90 శాతం వృద్ధి కనిపించిందన్న మాట. 2022 జనవరిలో మహీంద్రా అండ్ మహీంద్రా 19,838 యూనిట్లను విక్రయించింది.


5. కియా
Kia Motors India Pvt Ltd 2023 జనవరిలో 19,297 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 9,473 యూనిట్లు పెరిగింది. ఇది నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 96.42 శాతం వృద్ధి కనిపించింది. 2022 జనవరిలో కంపెనీ 9,824 యూనిట్లను విక్రయించింది.


6. టయోటా
టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ 2023 జనవరిలో 10,941 కార్లను విక్రయించింది. అయితే 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 410 యూనిట్లు తగ్గిందన్న మాట. ఇది నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 3.61 శాతం విక్రయాలు తగ్గాయి. 2022 జనవరిలో టయోటా 11,351 యూనిట్లను విక్రయించింది.


7. స్కోడా ఫోక్స్‌వ్యాగన్
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ 2023 జనవరిలో 8,650 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 2,818 యూనిట్లు పెరిగింది. నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 48.31 శాతం వృద్ధి కనిపించింది. 2022 జనవరిలో స్కోడా ఫోక్స్‌వ్యాగన్ 5,832 యూనిట్లను విక్రయించింది.


8. హోండా
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2023 జనవరిలో 7,408 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 133 యూనిట్లు తగ్గింది. ఇది నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 1.76 శాతం తగ్గిందన్న మాట. 2022 జనవరిలో కంపెనీ 7,541 యూనిట్లను విక్రయించింది.


9. రెనో
Renault India Pvt Ltd 2023 జనవరిలో 2023 జనవరిలో 7,296 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 404 యూనిట్లు తగ్గిందన్న మాట. నెలవారీ విక్రయాలలో సంవత్సరంతో పోల్చినప్పుడు 5.24 శాతం తగ్గిందన్న మాట. 2022 జనవరిలో కంపెనీ మొత్తంగా 7,700 యూనిట్లను విక్రయించింది.


10. ఎంజీ మోటార్స్
ఎంజీ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2023 జనవరిలో 3,279 యూనిట్లను విక్రయించింది. 2022 జనవరి అమ్మకాలతో పోలిస్తే 61 యూనిట్లు తగ్గింది. నెలవారీ విక్రయాలలో సంవత్సరానికి 1.82 శాతం తగ్గిందన్న. 2022 జనవరిలో కంపెనీ 3,340 యూనిట్లను విక్రయించింది.