TVS Radeon Price, Features And Mileage Details: మన దేశంలో టీవీఎస్‌ మోటార్ బైక్‌లు, స్కూటర్లకు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఒకసారి ఈ కంపెనీ టూవీలర్‌ను ఉపయోగించిన వాళ్లు మరో బ్రాండ్‌ గురించి దాదాపుగా ఆలోచించరు, టీవీఎస్‌ బండ్లు ఇచ్చే కంఫర్ట్‌ అలాంటింది. TVS మోటార్ బైక్‌లు, స్కూటర్లు సామాన్యుడి బడ్జెట్‌లో రావడం, బెటర్‌ మైలేజ్‌, స్టెబిలిటీ, రైడర్‌-ఫ్రెండ్లీ ఫీచర్లు ఈ బ్రాండ్‌ ఇమేజ్‌ & పాపులారిటీకి కారణం. కామన్‌ మ్యాన్‌ పర్స్‌ను, అవసరాలను దృష్టిలో పెట్టుకుని టీవీఎస్‌ లాంచ్‌ చేసిన "రేడియన్ 110" మోటార్ సైకిల్ మోడల్‌ మార్కెట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఈ మోడల్‌లో "ఆల్‌-బ్లాక్‌" ఎడిషన్‌కు (TVS Radeon All-Black Edition) డిమాండ్‌ పీక్స్‌లో ఉంది. ఈ బండి డీసెంట్‌ డిజైన్ & మెరుగైన మైలేజీ దీని పాపులారిటీని పెంచాయి. టీవీఎస్‌ రేడియన్‌ 110 ఆల్‌-బ్లాక్‌ వేరియంట్‌ను రేడియన్‌ మెటల్‌ బ్లాక్‌ ఎడిషన్‌ (TVS Radeon Metal Black Edition) అని కూడా పిలుస్తారు.

Continues below advertisement


ఇంటి నుంచి ఆఫీస్‌, వ్యాపార సంస్థ, ఇతర పనులకు వెళ్లడానికి లేదా రోజువారీ ప్రయాణం కోసం మంచి మైలేజ్‌ ఇచ్చే బైకుల్లో TVS Radeon 110 ఒకటి. TVS ఈ బైక్‌ను నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది. TVS Radeon ఆల్-బ్లాక్ ఎడిషన్‌ రేటు, డౌన్ పేమెంట్ & EMI వివరాలను ఇప్పుడు చూద్దాం.


తెలుగు రాష్ట్రాల్లో ధర
TVS రేడియన్ ఆల్‌-బ్లాక్‌ వేరియంట్‌ను కొనాలంటే, తెలుగు రాష్ట్రాల్లో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర ‍‌(TVS Radeon 110 Ex-Showroom Price) 72,153 రూపాయలు. బండి రిజిస్ట్రేషన్‌ (RTO) ఖర్చులు 10,158 రూపాయలు, బీమా (Insurance) 5,982 రూపాయలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఆన్‌-రోడ్‌ ధర ‍‌(TVS Radeon 110 On-Road Price) 88,293 రూపాయలు అవుతుంది. డీలర్‌షిప్‌ను బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.


Radeon Drum వేరియంట్‌ ఆన్‌-రోడ్‌ ధర 97,340 రూపాయలు


Radeon Digital - Drum వేరియంట్‌ ఆన్‌-రోడ్‌ ధర 1,02,281 రూపాయలు


Radeon Digital - Disc వేరియంట్‌ ఆన్‌-రోడ్‌ ధర 1,06,838 రూపాయలు,


రూ.1800 EMI బండిని ఇలా సొంతం చేసుకోండి
హైదరాబాద్‌ లేదా విజయవాడలో, TVS Radeon 110 ఆల్-బ్లాక్ ఎడిషన్‌ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 88,293 కాబట్టి, మీరు 15,293 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే మిలిగిన 73,000 రూపాయలను బైక్ లోన్‌గా తీసుకోవాలి. బ్యాంక్‌ మీకు 9% వడ్డీ రేటుకు ఈ రుణం మంజూరు చేసిందని భావిద్దాం. మీరు ప్రతి నెలా కేవలం రూ. 1,803 EMIని 4 సంవత్సరాల పాటు చెల్లిస్తే చాలు, ఈ లోన్‌ మొత్తం క్లియర్‌ అవుతుంది. ఇంకా వేగంగా లోన్‌ తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 3,200 EMI కట్టుకుంటూ వెళితే 3 సంవత్సరాల్లో రుణం మొత్తం తీరిపోతుంది, బండి పూర్తిగా మీదవుతుంది.


టీవీఎస్ రేడియన్ ఫీచర్లు
టీవీఎస్ రేడియన్ 109.7 cc ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో నడుస్తుంది. ఈ ఇంజిన్ 7,350 rpm వద్ద 8.08 bhp మ్యాగ్జిమన్‌ పవర్‌ను & 4,500 rpm వద్ద 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్ స్మూత్‌ అండ్‌ స్టెడీగా పరుగులు తీస్తుంది. రేడియన్ 110 అన్ని వేరియంట్లలో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉపయోగించారు వీటికి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా బిగించారు.


టీవీఎస్ రేడియన్‌ మైలేజీ
టీవీఎస్ రేడియన్‌ ఫుల్‌ ట్యాంక్‌ కెపాసిటీ 10 లీటర్లు. ARAI డేటా ప్రకారం మైలేజ్ 73 kmpl. ఈ లెక్కన, ఒకసారి ఈ టూవీలర్‌ ట్యాంక్ నిండితే బైక్‌ను 730 కిలోమీటర్లు నడపవచ్చు.