Hyundai IONIQ 5 EV Range: హ్యుందాయ్ అయానిక్‌ 5 ఎలక్ట్రిక్‌ కార్‌ గురించి అంతర్జాతీయ ఆటో మార్కెట్‌లో ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. కార్‌ ఇండస్ట్రీ పెద్దలు, ఔత్సాహికులు ఈ మోడల్‌ గురించి నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. దక్షిణ కొరియాలో నివసిస్తున్న లీ యంగ్-హ్యూమ్ అనే వ్యక్తి, కొంతకాలం క్రితం Hyundai IONIQ 5 EVని కొన్నాడు. కొన్ననాటి నుంచి ఈ ఎలక్ట్రిక్ కారును 5.8 లక్షల కిలోమీటర్లు నడిపాడు. ఇంతదూరం ప్రయాణం తర్వాత కూడా ఈ కారు బ్యాటరీ 87.7% ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడం విశేషం.

EV గురించి మాట్లాడినప్పుడల్లా తలెత్తే మొదటి ప్రశ్న/భయం - బ్యాటరీ ఎంతకాలం వస్తుంది?. లీ కథ ఆ భయాన్ని పారదోలింది. లీ, తన Ioniq 5 ని ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఛార్జ్ చేస్తూ దాదాపు 6 లక్షల కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ, బండి బ్యాటరీపై పెద్దగా ప్రభావం పడలేదు.

రోజుకు సగటున 586 కి.మీ. ప్రయాణం లీ యంగ్-హ్యూమ్ వృత్తి రీత్యా సేల్స్‌మ్యాన్ & రోజుకు సగటున 586 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అతను 5.80 లక్షల కిలోమీటర్ల ప్రయాణాన్ని దాదాపు 2 సంవత్సరాల 9 నెలల్లో పూర్తి చేశాడు. అంతదూరం ప్రయాణించిన తర్వాత కూడా ఆ కారు బ్యాటరీ, మోటారు లేదా విద్యుత్ వ్యవస్థలో ఎటువంటి సమస్య కనిపించకపోవడం అత్యంత ఆసక్తికరమైన విషయంగా మారింది. సాధారణంగా, ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీని వేగంగా దెబ్బతీస్తుందని చెబుతుంటారు, కానీ లీ కథ దానిని విరుద్ధంగా నిరూపించింది. రోజువారీ ప్రయాణంలో లీ తన అయానిక్‌ 5 EVని ఎక్కువ సార్లు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జ్‌ చేశాడు, అయినప్పటికీ బ్యాటరీ పనితీరు అద్భుతంగా ఉంది.

ఆశ్చర్యపోయిన హ్యుందాయ్-కియా పరిశోధన బృందంలీ ఉపయోగిస్తున్న కారు గురించి వార్తల్లో రావడంతో, హ్యుందాయ్-కియా పరిశోధన బృందం అతని ఇంటికి వెళ్లింది. కారు బ్యాటరీ & మోటారును అత్యాధునిక పరికరాలతో పరీక్షించింది. ఆ పరీక్ష సమయంలో, 5.80 లక్షల కి.మీ దూరం ప్రయాణం తర్వాత కూడా బ్యాటరీ హెల్త్‌ 87.7% వద్ద ఉందని సైంటిఫిక్‌గా నిర్ధరణ అయింది. ఈ నంబర్‌ కూడా ప్రత్యేకమైనది, ఎందుకంటే సాధారణంగా ఇటువంటి మైలేజ్ టాక్సీలు లేదా వాణిజ్య వాహనాలలో మాత్రమే కనిపిస్తుంది.

పెట్రోల్ కారుతో పోలిస్తే రూ.25 లక్షల పొదుపులీ, అయానిక్‌ 5 EVని కొనకుండా 'హ్యుందాయ్ టక్సన్' లాంటి పెట్రోల్ కారులో అదే దూరం ప్రయాణించి ఉంటే, అతను ఇంధనం కోసం దాదాపు రూ. 48.56 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే, IONIQ 5తో ఈ ప్రయాణం కేవలం రూ. 30.36 లక్షలలో పూర్తయింది. అంటే, అతని కళ్ల ముందే రూ. 18.2 లక్షలు మిగిలాయి. సాధారణంగా, సాంప్రదాయ ఇంధన కార్లతో పోలిస్తే EVల నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. పెట్రోల్ కారులో ఇదే దూరానికి ఆయిల్‌ను 66 సార్లు, బ్రేక్ ఫ్లూయిడ్‌ను 13 సార్లు, స్పార్క్ ప్లగ్‌ను 8 సార్లు & ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ను 11 సార్లు మార్చాల్సి ఉంటుంది. IONIQ 5లో వీటి అవసరం లేదు. జనరల్‌ సర్వీస్‌లు & కొన్ని కన్జ్యూమబుల్స్‌ను మాత్రమే మార్చాడు. దీని అర్థం దాదాపు మరో రూ. 7 లక్షలు ఆదా. మొత్తం కలిపితే మూడేళ్లలో లీ రూ. 25 లక్షలకు పైగా సేవ్‌ చేసుకున్నాడు.

స్లో ఛార్జింగ్ సమస్య6.5 లక్షల కి.మీ. తర్వాత, మొత్తం ప్రయాణంలో ఒకే ఒక్కసారి స్లో ఛార్జింగ్ సమస్య కనిపించినట్లు లీ వెల్లడించాడు. ఇది తప్ప కారులో వేరే సాంకేతిక సమస్య లేదని తెలిపాడు. హ్యుందాయ్-కియా పరిశోధన బృందం చెప్పిన ప్రకారం, ఆన్-బోర్డ్ ఛార్జర్ దాని లైఫ్‌టైమ్‌ కంటే ఎక్కువ కాలం పని చేసిందని తేలింది.